ETV Bharat / business

'స్టార్ గుర్తు ఉన్న కరెన్సీ నోట్లు చెల్లవా?'.. సోషల్​ మీడియా ప్రచారంపై ఆర్​బీఐ క్లారిటీ

author img

By

Published : Jul 27, 2023, 9:32 PM IST

Updated : Jul 27, 2023, 10:03 PM IST

Star Symbol Notes : కరెన్సీ నోట్లపై స్టార్‌ సింబల్‌ ఉండడంపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చకు ఆర్‌బీఐ చెక్‌ పెట్టింది. వాటి చెల్లుబాటుపై స్పష్టతనిచ్చింది.

star symbol notes
star symbol notes

Star Symbol Notes : స్టార్​ (*) గుర్తు ఉన్న కరెన్సీ నోట్లు కూడా అన్ని చట్టబద్ధమైన నోట్ల లాగే సమాన హోదాను కలిగి ఉంటాయని స్పష్టం చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కరెన్సీ నోట్లపై స్టార్‌ (*) సింబల్‌ ఉండడంపై ఇటీవల సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. స్టార్ గుర్తు ఉన్న నోట్లు నకిలీవి అంటూ పలువురు పోస్టులు పెట్టడం వైరల్‌గా మారింది. ఈ విషయం ఆర్​బీఐ దృష్టికి రావడం వల్ల తాజాగా స్పష్టత ఇచ్చింది. ఈ తరహా నోట్లు నకిలీవి కావని, అవి కూడా ఆర్‌బీఐ జారీ చేసినవేనని చెప్పింది. ఇతర చట్టపరమైన నోట్లలానే ఇవి కూడా చెల్లుబాటు అవుతాయని తెలిపింది.

Rbi Clarification On Star Symbol Notes : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ రకాల నోట్లను జారీ చేస్తుంది. సాధారణంగా ఈ నోట్లపై సీరియల్‌ నంబర్‌ ముద్రించి ఉంటుంది. కానీ, ఇటీవల కాలంలో కొన్ని నోట్లపై స్టార్‌ గుర్తు ముద్రించి వస్తున్నాయి. దీనిని గమనించిన కొందరు.. ఇవి నకిలీ నోట్లంటూ సోషల్‌ మీడియాలో పెట్టడం వల్ల దీనిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. అన్ని ఇతర నోట్లలానే అవి కూడా చెల్లుబాటు అవుతాయని చెప్పింది. ప్రిఫిక్స్‌, సీరియల్‌ నంబర్‌ మధ్య ఈ స్టార్‌ గుర్తు ఉంటుందని వివరించింది.

RBI Star Series Notes : రీప్లేస్‌ చేసిన, పునర్‌ ముద్రించిన స్టార్‌ గుర్తుతో వస్తాయని ఆర్‌బీఐ స్పష్టతనిచ్చింది. వాటిని సులువుగా గుర్తించానికే ఈ స్టార్‌ సింబల్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. మరోవైపు సోషల్‌ మీడియాలో ఫేక్​ న్యూస్​ ప్రచారం పట్ల ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో సైతం స్పందించింది. అవేవీ నకిలీ నోట్లు కాదని.. ప్రచారం పట్ల భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు చెప్పింది. అంతకుముందు 2016లో ఆర్‌బీఐ జారీ చేసిన రూ. 500 నోట్లపై కూడా స్టార్‌ సింబల్‌ ఉందని గుర్తుచేసింది.

  • कहीं आपके पास भी तो नहीं है स्टार चिह्न (*) वाला नोट❓

    कहीं ये नकली तो नहीं❓

    घबराइए नहीं ‼️#PIBFactCheck

    ✔️ ऐसे नोट को नकली बताने वाले मैसेज फर्जी है।

    ✔️ @RBI द्वारा दिसंबर 2016 से नए ₹500 बैंक नोटों में स्टार चिह्न (*) की शुरुआत की गई थी

    🔗https://t.co/2stHgQNyje pic.twitter.com/bScWT1x4P5

    — PIB Fact Check (@PIBFactCheck) July 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి : రూ.500 నోటు.. ఒరిజినలా..? నకిలీదా..? ఎలా తెలుసుకోవడం?

బ్యాంకులకు తిరిగొచ్చిన మూడోవంతు రూ.2000నోట్లు.. ఇంకా 3 నెలల గడువు ఉండగానే..

Last Updated :Jul 27, 2023, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.