ETV Bharat / business

EPFO Extends Deadline : పీఎఫ్​ ఖాతాదారులకు గుడ్​న్యూస్!​.. పెన్షన్​ వివరాల అప్లోడ్​ గడువు పెంపు.. లాస్ట్​ డేట్​ ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2023, 7:11 AM IST

EPFO Extends Deadline For Higher Pension Option To Employers : ఉద్యోగుల వేతన వివరాలు నమోదు చేసేందుకు విధించిన గడువును మరో మూడు నెలల పాటు పొడగించింది ఈఫీఎఫ్​ఓ. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తంగా 2023 డిసెంబర్ వరకు గడువును పెంచుతున్నట్లు కార్మిక శాఖ పేర్కొంది.

EPFO Extends Deadline For Higher Pension Option To Employers
ఈపీఎఫ్​ఓ పెన్షన్ పెంపు దరఖాస్తు చివరి తేదీ

EPFO Extends Deadline For Higher Pension Option To Employers : అధిక పింఛనుకు సంబంధించి వివరాల అప్లోడ్ చేసేందుకు వేతన జీవులకు ఇచ్చిన గడువును మరికొద్ది రోజుల పాటు పొడగించింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO). మరో మూడు నెలల గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్‌ 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఉద్యోగులకు సూచించింది.

వాస్తవానికి సెప్టెంబర్‌ 30తో ఈ గడువు ముగియాల్సి ఉంది. కాకపోతే గడువు పెంచాల్సిందిగా ఎంప్లాయర్స్‌ అసోసియేషన్‌ నుంచి ఈఫీఎఫ్​ఓకు వినతులు వచ్చాయి. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర కార్మిక శాఖ.. గడువు పెంపు నిర్ణయం తీసుకుంది. దీంతో వేతన వివరాలను ఆన్​లైన్​లో అప్లోడ్​ చేసేందుకు ఉద్యోగులకు మరింత సమయం లభించింది.

"అధిక పింఛను ఆప్షన్‌కు సంబంధించి పెన్షన్లు/ మెంబర్లకు వేతన వివరాలు అప్లోడ్ చేసేందుకు గడువు ఇవ్వాలని ఎంప్లాయర్స్‌ అండ్‌ ఎంప్లాయర్స్‌ అసోసియేషన్‌ నుంచి మాకు వినతి అందింది. సెప్టెంబర్‌ 29 నాటికి వ్యాలిడేషన్ ఆఫ్‌ ఆప్షన్‌/ జాయింట్‌ ఆప్షన్‌కు సంబంధించి ఇప్పటికీ 5.52 లక్షల దరఖాస్తులు ఎంప్లాయర్స్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నాం" అని కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది.

గడువు తేదీని పలుమర్లు పొడగించిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్​ఓ..
2022 నవంబర్‌ 4న అధిక పింఛనుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తొలుత ఉద్యోగులకు అధిక పింఛను దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి ఫిబ్రవరి 26-మే 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించారు. అనంతరం ఆ గడువును జూన్‌ 26 వరకు పొడిగించారు. తర్వాత మరో 15 రోజులు చివరి అవకాశంగా గడువు ఇచ్చారు. జులై 11 వరకు దరఖాస్తులను స్వీకరించారు. అప్పటి వరకు వ్యాలిడేషన్‌ ఆఫ్‌ ఆప్షన్‌/ జాయింట్‌ ఆప్షన్‌ కోసం మొత్తం 17.49 లక్షల దరఖాస్తులు అందినట్లు కేంద్ర కార్మిక శాఖ పేర్కొంది.

How to Choose Real Estate Broker : రియల్​ ఎస్టేట్​ బ్రోకర్​ను ఎంచుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

What Is Top Up Health Insurance Policy : హెల్త్ ఇన్సూరెన్స్​ టాపప్‌తో మరింత ధీమా.. ఈ లాభాలు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.