ETV Bharat / business

Digital loans precautions : డిజిటల్ రుణాలు తీసుకుంటున్నారా?.. తస్మాత్​ జాగ్రత్త!

author img

By

Published : Aug 5, 2023, 5:08 PM IST

Digital loans precautions : ఈ మధ్యకాలంలో ఆన్​లైన్​ లోన్​ యాప్​​లు చాలానే పుట్టుకొస్తున్నాయి. ఇవి తమ వలలో చిక్కుకున్న అమాయకులను భారీగా దోచుకుంటున్నాయి. అందుకే వాటిపైన ఆర్​బీఐ కఠినమైన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ కొన్ని యాప్​లు చట్ట విరుద్ధంగా రుణాలను ఇస్తున్నాయి. వీటి బారిన పడిన బాధితులను నిండా ముంచుతున్నాయి. అందుకే ఈ ఆన్​లైన్​, డిజిటల్​ రుణ యాప్​ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ ఆన్​లైన్ లోన్​ మోసాలకు గురికాకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దామా?

Digital loans precautions
Digital loans precautions

Digital loans precautions : యూపీఐ ఆధారిత చెల్లింపుల విషయంలో ఇప్పటికే భారత్​ ముందజలో ఉంది. చాలా ఫిన్​టెక్​ సంస్థలు యూపీఐ ద్వారా నగదు చెల్లింపులే కాకుండా రుణాలు తీసుకోనే సదుపాయాన్ని కూాడా అందుబాటులోకి తీసుకొచ్చాయి. డిజీలాకర్, వీడియో ఆధారిత కేవైసీలాంటి వాటి ఆధారంగా రుణాలను అందిస్తున్నాయి.

ఈ మధ్యకాలంలో చాలా సులభంగా రుణాలు తీసుకోవడానికి డిజిటల్ రుణాలు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ప్రజలు సులభతరమైన పద్ధతిలో రుణాలను తీసుకుంటున్నారు. కానీ తరవాత భారీ వడ్డీలు భరించలేక రుణగ్రహీతలు ఇబ్బందులకు గురవుతున్నారు. అందువల్ల లోన్లు ఇచ్చే యాప్​ల విషయంలో ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. అందువల్ల అప్పులు తీసుకోనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్​బీఐ రిజిస్టర్డ్​ కంపెనీల్లో రుణాలు...
RBI registered companies : రుణాలు తీసుకోనేటప్పుడు ఆర్​బీఐ అనుమతి ఉన్న సంస్థలను ఎంచుకోవటం మంచిది. బ్యాంకులు లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు వాస్తవానికి ఆర్​బీఐలో రిజిస్ట్రార్ అయ్యుండాలి. కానీ చాలా ఫ్రాడ్ సంస్థలు ఇందుకు విరుద్ధంగా పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల అప్పు తీసుకోవాలని అనుకున్నప్పుడు ఆ సంస్థ ఆర్​బీఐ దగ్గర నమోదై ఉందా లేదా చూసుకోవాలి. ఫోన్లలో, యాప్​లో రుణాలు ఇస్తున్న సంస్థలు తరవాత ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అందుకే ఆర్​బీఐ అనుమతి లేకుండా రుణాలు ఇచ్చే సంస్థలకు దూరంగా ఉండాలి. ఇలాంటి వాటిపైన ఆర్​బీఐ చర్యలు తీసుకున్నా.. చట్టవిరుద్ధంగా కొన్ని సంస్థలు ఇంకా రుణాలు అందిస్తున్నాయి.

స్కోరును అనుసరించి రుణాలు
Best Credit score : రుణాలు ఇవ్వడానికి ఆ వ్యక్తి ఆదాయం, క్రెడిట్​ స్కోరును ఆర్థిక సంస్థలు పరిగణనలోకి తీసుకుంటాయి. మంచి క్రెడిట్​ స్కోరు (750 పాయింట్లు కంటే ఎక్కువ), స్థిరమైన ఆదాయం ఉంటే రుణం కోసం బ్యాంకులను ఎంచుకోండి. క్రెడిట్​ స్కోరు తక్కువగా ఉన్నా లేదా ఆదాయం తక్కువ ఉన్నా.. బ్యాంకింగేత ఆర్థిక సంస్థలు (ఎన్​బీఎఫ్​సీ) నుంచి అప్పు తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు. మీ క్రెడిట్ స్కోరును మంచిగా ఉండేలా చూసుకుంటే తక్కువ వడ్డీకే రుణం మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు ప్రయత్నం చేయండి.

వడ్డీ రేట్ల విషయంలో జాగ్రత్త!
Digital loans interest rates : అప్పు కావాలనుకున్న వెంటనే.. తక్కువ వడ్డీకి రుణం ఎవరు ఇస్తారా అని చూస్తాం. క్రెడిట్​ స్కోరు మంచిగా ఉంటే తక్కువ వడ్డీకే రుణం తీసుకొనే ప్రయత్నాలు చేయవచ్చు. ఇంతకముందు తీసుకున్న రుణాలు లేటుగా చెల్లించి ఉంటే స్కోరు తగ్గుతుంది. తక్కువ స్కోరు ఉంటే వడ్డీ రేటు పెరుగుతుంది. అప్పు తీసుకోనేటప్పుడు వడ్డీలను, రుసుములను జాగ్రతగా పరిశీలించాలి. అందులో సంవత్సరానికి చెల్లించే వడ్డీ రేటూ ఉందా లేదా చూసుకోవాలి. రుణాలు ముందుగా లేదా ఆలస్యంగా చెల్లిస్తే ఎలాంటి ఛార్జీలు విధిస్తారో తెసుకోవాలి. వాస్తవానికి రుణాలు అందించే సంస్థలు ఈ వివరాలను తప్పనిసరిగా రుణగ్రహీతలకు తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ వీటి గురించి చెప్పకపోతే.. ఆలాంటి సంస్థలు, యాప్​ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.

పోల్చి చూసుకోవాలి..
compare to other loan apps : ఆన్​లైన్​లో రుణం తీసుకొనేటప్పుడు ముందుగా వడ్డీ రేట్లు, రుసుముల చెల్లింపుల సమయంలో ఉండే నిబంధనలు చూసుకోవాలి. మిగిలిన సంస్థలూ ఎలాంటి షరతులు పెట్టాయనేది పోల్చి చూసుకోండి. అన్ని సంస్థలు ఈ సమాచారాన్ని ఆన్​లైన్​లో అందిస్తాయి.

క్రెడిట్​ స్కోర్ రెగ్యులర్​గా చెక్ చూసుకోవాలి
Credit score check : తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించటమే ఉత్తమం. ఇలా చేయటం వల్ల క్రెడిట్​ స్కోరు మెరుగుపడతుంది. వాయిదాల చెల్లింపు ఆలస్యం అవుతుందని అనుకుంటే రుణదాతకు ఆ విషయాన్ని చెప్పండి. క్రెడిట్​ స్కోరును సరిచూసుకుంటూ ఉండాలి. కొన్ని సార్లు రుణం చెల్లించిన విషయాన్ని రుణదాతలు క్రెడిట్​ బ్యూరోలకు చెప్పటం మరిచిపోతారు. దీనితో స్కోరు తగ్గిపోతుంది. అందుకే రెగ్యులర్​గా మీ క్రెడిట్​ స్కోర్​ను చెక్ చేసుకోవడం మంచిది.

రుణగ్రహీత సమాచారం సురక్షితంగా..
Customer data protection : రుణగ్రహీత సమాచారాన్ని భద్రతంగా ఉండేలా ఆర్థిక సంస్థలు చూసుకోవాలి. రుణాన్ని ఇవ్వడానికి అవసరమైన సమాచారాన్ని మాత్రమే తీసుకోవాలి. రికవరీ ఏజెన్సీలు, లోన్ ప్రొవైడర్లు లాంటి వాటికి నియంత్రిత పద్ధతిలో మాత్రమే సంబంధిత అంశాల్ని అందించాలి. ఈ మధ్యకాలంలో కొన్ని యాప్​లు ఫోటోలు, వీడియోల లాంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి. తరవాత రుణగ్రహీతలను పలు విధలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అందుకే ఇలాంటి ఫ్లాడ్​ లోన్​ యాప్​ల వలలో పడకుండా జాగ్రతగా ఉండాలి.

సులభంగా రుణాలు ఇస్తున్నారు కదా అని అనవసరంగా తీసుకోవటం మంచిది కాదు. అవసరం ఉంటేనే అప్పు తీసుకోవాలి. అనవసరంగా రుణం తీసుకొని మోసపోయి ఇబ్బందులు ఎదుర్కోవటం కంటే ముందుగానే అన్నింటిని పరిశీలించి తీసుకోవటం మంచిది. స్తోమతకు మించి అప్పులు చేయటం కూడా సరైనది కాదు. ఎందుకంటే వాటిని తీర్చలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

రిటైర్మెంట్‌ ప్లాన్​ ఇలా చేసుకోండి.. వృద్ధాప్యంలో డబ్బులకు ఢోకా ఉండదు!

Education Loan Tips : మీ విద్యా రుణం త్వరగా తీర్చేయాలా?.. ఈ టిప్స్ పాటించండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.