ETV Bharat / business

స్టాక్ ​మార్కెట్లకు లాభాలు- సెన్సెక్స్​ 450 ప్లస్​

author img

By

Published : Nov 25, 2021, 3:43 PM IST

Sensex surges over 450 points
లాభాల్లో ముగిసిన స్టాక్​మార్కెట్లు

(Stock market today) దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు గురువారం సెషన్​ను లాభాలతో ముగించాయి. ప్రారంభంలో నష్టాలను చవిచూసిన మార్కెట్లు.. క్రమంగా కోలుకుని లాభాల బాట పట్టాయి. దీంతో సెన్సెక్స్​ (sensex today) 454, నిఫ్టీ (nifty today) 121 పాయింట్ల మేర పెరిగాయి.

స్టాక్ ​మార్కెట్లు గురువారం సెషన్​ను లాభాలతో ముగించాయి. ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు మెల్లగా లాభాల్లోకి వచ్చాయి. విద్యుత్​, ఐటీ, ఫార్మా రంగ షేర్లు(Stocks in news) రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ (Sensex today India) సెన్సెక్స్ 454 పాయింట్లు పెరిగి.. 58,795 వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ (nifty today) 121 పాయింట్ల లాభంతో 17,536 వద్ద సెషన్​ను(Stock market news) ముగించింది.

ఇంట్రాడేలో ఇలా..

  • బీఎస్​ఈ సెన్సెక్స్​ 58,901 పాయింట్ల గరిష్ఠాన్ని.. 58,143 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
  • ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 17,564 పాయింట్ల అత్యధిక స్థాయిని.. 17,417 పాయింట్ల అత్యల్ప స్థాయి మధ్య కదలాడింది.

లాభనష్టాల్లో..

  • రిలయన్స్​, ఎన్​టీపీసీ, భారతీ ఎయిర్​టెల్​, హెచ్​సీఎల్​ టెక్​ ​, సన్​ఫార్మా, టీసీఎస్​, పవర్​ గ్రిడ్​ షేర్లు (Stocks in news) రాణించాయి.
  • హిందుస్థాన్​ యూనిలివర్​ , ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​ ​, మారుతీ షేర్లు నష్టాలను చవిచూశాయి.

ఇవీ చూడండి:

బిట్​కాయిన్​పై 'బేర్' పంజా.. ప్రభుత్వ నియంత్రణే కారణం!

శాం​సంగ్ ఇండియాలో భారీగా ఉద్యోగ అవకాశాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.