ETV Bharat / business

రెండో విడత జీఎస్​టీ పరిహారం విడుదల

author img

By

Published : Nov 2, 2020, 7:59 PM IST

జీఎస్​టీ పరిహారం కింద 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు రెండో విడత నిధులను విడుదల చేసింది ఆర్థిక శాఖ. అక్టోబర్ 23న మొదటి దశలో రూ.6 వేల కోట్ల నిధులకు ఆయా రాష్ట్రాలకు విడుదల చేసింది కేంద్రం.

gst shortfall transfer news
రెండో దశ జీఎస్​టీ పరిహారం బదిలీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

రెండో విడత జీఎస్​టీ పరిహారం కింద రూ.6 వేల కోట్లు బదిలీ చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం ప్రకటించింది. 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ మొత్తం అందనున్నట్లు తెలిపింది.

ఆక్టోబర్ 23న మొదటి దశలో రూ.6 కోట్లను 16 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు బదిలీ చేసింది కేంద్రం.

జీఎస్​టీ సెస్​ కొరతను తీర్చేందుకు ప్రత్యేక విండో ద్వారా ఈ నిధులను బదిలీ చేస్తున్నట్లు ఆర్థిక శాఖ వివరించింది. ఈ మొత్తాన్ని 4.42 శాతం వడ్డీ రేటుకు అప్పుగా తీసుకున్నట్లు పేర్కొంది.

ఈ మొత్తం పరిహారాన్ని అందుకునే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. ఆంధ్రప్రదేశ్, అసోం, బిహార్, గోవా, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయా, ఒడిశా, తమిళనాడు, త్రిపుర, ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్, దిల్లీ, జమ్ముకశ్మీర్, పుదుచ్చేరిలు ఉన్నాయి.

ఇదీ చూడండి:8 నెలల తర్వాత రూ.లక్ష కోట్లపైకి జీఎస్​టీ వసూళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.