ETV Bharat / business

2020లో క్రెడిట్​ స్కోరు తగ్గిందా.. ఇది మీ కోసమే!

author img

By

Published : Jun 6, 2020, 1:31 PM IST

reason behind credit score down
క్రెడిట్ స్కోరు ఎందుకు తగ్గుదలకు కారణం

ఇటీవల క్రెడిట్ స్కోరు చూసుకున్న వారిలో చాలా మంది తమ స్కోరు తగ్గడంపై ఆందోళనలో పడ్డారు. చాలా మందికి ఇదే సమస్య ఎదురైంది. అయితే క్రెడిట్​ స్కోరు తగ్గుదలపై సిబిల్​ స్పష్టతనిచ్చింది. స్కోరింగ్ విధానంలో చేసిన మార్పులే ఇందుకు కారణంగా తెలిపింది. స్కోరింగ్ విధానంలో మార్పులు సహా సిబిల్ తెలిపిన మరిన్ని వివరాలు మీ కోసం.

జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు సిబిల్ నుంచి వచ్చిన మీ క్రెడిట్ స్కోరును చూసి షాక్ అయ్యారా? అయితే, మీరు ఎలాంటి గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ (సీఐసీ) రుణగ్రహీతలు, కార్డుదారులకు ఇచ్చే స్కోర్ విధానంలో మార్పులు చేసింది సిబిల్​. కొత్త స్కోరింగ్ విధానం కారణంగా, క్యాలెండర్ సంవత్సరం ప్రారంభం నుంచి చాలా మంది క్రెడిట్ స్కోర్లు తగ్గాయి.

ఇకపై 36 నెలల డేటా..

ట్రాన్స్‌యూనియన్ సిబిల్ వెబ్‌సైట్ నుంచి వచ్చిన డేటా ప్రకారం, జనవరిలో మొత్తం వినియోగదారులలో 60 శాతం మందికి 775 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు ఉంది. కానీ ఇప్పుడు 37 శాతం మంది వినియోగదారులకు మాత్రమే 765 కంటే ఎక్కువ స్కోరు ఉంది.

'ఇటీవల మేము ఒక కొత్త స్కోరింగ్ విధానాన్ని ప్రారంభించాం. ఇది 36 నెలల క్రెడిట్ డేటా ఆధారంగా పనిచేస్తుంది. అంతకుముందు మేము 24 నెలల డేటాను మాత్రమే పరిశీలించే వాళ్లం' అని సిబిల్ తెలిపింది. ఇది సిబిల్ క్రెడిట్విజన్ స్కోరు మూడవ వెర్షన్.

ఆందోళన వద్దు..

క్రెడిట్ స్కోర్‌ల తగ్గుదల గురించి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సిబిల్ స్పష్టం చేసింది. ఇది రుణదాతల తిరస్కరణకు దారితీయదని హామీ ఇచ్చింది. సిబిల్ కొత్త స్కోరింగ్ విధానాన్ని అమలు చేసినందున, సీఐసీ తన మెంబర్ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో (ఎన్‌బీఎఫ్‌సీ) తమ రుణ విధానాలను మార్చేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది సిబిల్. అల్గారిథంలు మారడం వలన పాత, కొత్త స్కోర్‌ల మధ్య వ్యత్యాసం ఉండవచ్చు.. ఇందులో భాగంగానే అదే డేటాతో కూడా మీ క్రెడిట్ స్కోరు తగ్గొచ్చని పేర్కొంది.

కొత్త విధానం ఎందుకు?

సంస్థాగత కారణాల వలన ట్రాన్స్‌యూనియన్ సిబిల్ కొత్త స్కోరింగ్ విధానాన్ని ప్రారంభించింది. కొత్త స్కోరింగ్ విధానం సరికొత్త సాంకేతికతతో పనిచేయనుంది.

కొత్త విధానంలో 36 నెలల డేటాపై రుణాల తీసుకోవడం ద్వారా కచ్చితమైన స్కోరును అందించేందుకు వీలవుతుందని సిబిల్ పేర్కొంది. ఇప్పటి వరకు 24 నెలల డేటాను మాత్రమే విశ్లేషించేది సిబిల్.

పాత స్కోరింగ్ విధానంలో వినియోగదారులు క్రెడిట్​ స్కోర్​ నివేదికను పొందేందుకు ఆరు నెలల హిస్టరీ అవసరమయ్యేది. అయితే ఇప్పడు ఆ నిబంధనను సడలించి.. ఆరు నెలల లోపు హిస్టరీ ఉన్నా క్రెడిట్​ స్కోర్ రిపోర్ట్​ పొందేందుకు అవకాశం కల్పిస్తోంది సిబిల్.

ఇదీ చూడండి:బెంట్లీకి కరోనా దెబ్బ.. భారీ సంఖ్యలో ఉద్యోగాలు కట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.