ETV Bharat / business

బెంట్లీకి కరోనా దెబ్బ.. భారీ సంఖ్యలో ఉద్యోగాలు కట్​

కరోనా సంక్షోభంతో ఎన్నో సంస్థల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా లండన్​కు చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బెంట్లీ.. 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. భవిష్యత్​లో మరింత మందికి ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించింది.

Coronavirus: Bentley to cut 1,000 jobs, warns of further downsizing
బెంట్లీకీ కరోనా దెబ్బ.. 1000 మంది ఉద్యోగులకు ఉద్వాసన
author img

By

Published : Jun 6, 2020, 5:37 AM IST

కరోనా మహమ్మారితో ఏర్పడిన నష్టాన్ని తగ్గించుకునేందుకు బ్రిటన్​కు చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బెంట్లీ.. ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. ప్రస్తుతం 1000 మంది ఉద్యోగులకు ఉద్యాసన పలికినట్లు ప్రకటించింది. భవిష్యత్​లో మరింత మందిని తొలగిస్తామని స్పష్టం చేసింది.

ప్రస్తుతం స్వచ్ఛంద విరమణ ద్వారా ఉద్యోగులను తొలగిస్తున్నామని.. కానీ, భవిష్యత్​లో తప్పనిసరి ప్రాతిపదికన ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని పేర్కొంది. వృద్ధి ప్రణాళికలను కరోనా మహమ్మారి తీవ్రంగా దెబ్బతీసిందని, తప్పనిసరై ఉద్యోగులను తొలగించాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేసింది. సంస్థలో ప్రస్తుతం 4200 మంది ఉద్యోగులు ఉన్నారు.

లండన్​కు చెందిన మరో కార్ల తయారీ సంస్థ ఆస్టన్​ మార్టిన్​.. 500 ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

ఇదీ చూడండి: నిధుల సమీకరణపై టాటా గ్రూప్ కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.