ETV Bharat / business

క్యూ3 ఫలితాలు, బడ్జెట్ అంచనాలే కీలకం!

author img

By

Published : Jan 17, 2021, 12:49 PM IST

Budget impact on stock markets
స్టాక్ మార్కెట్లపై వ్యాక్సినేషన్ ప్రభావం

దేశీయ స్టాక్ మార్కెట్లకు ఈ వారం కంపెనీల క్యూ3 ఫలితాలు దిశా నిర్దేశం చేయనున్నాయి. కరోనా టీకా పంపిణీ అప్​డేట్లపై మదుపరులు దృష్టి సారించే వీలుంది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, బడ్జెట్ వార్తలు సూచీల ఒడుదొడుకులకు కారణమయ్యే వీలుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు, కరోనా టీకా పంపిణీ వార్తలు ఈ వారం స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేసే కీలకాంశాలుగా ఉండనున్నాయి. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, బడ్జెట్ 2021-22 వార్తలతో సూచీలు కాస్త ఒడుదొడుకులకు లోనవ్వచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

మదుపరులు కొవిడ్ టీకా పంపిణీ అప్​డేట్లపై దృష్టి సారించొచ్చని స్టాక్ బ్రోకర్లు అంటున్నారు. క్యూ3 ఫలితాల సీజన్​ నేపథ్యంలో.. కంపెనీల పనితీరు ఆధారంగానూ మదుపరులు స్పందించే వీలుందని విశ్లేషిస్తున్నారు.

ఈ వారం ఫలితాలు ప్రకటించే కంపెనీలు..

ఈ వారం క్యూ3 ఫలితాలు ప్రకటించే ప్రధాన కంపెనీల్లో.. రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫినాన్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, ఫెడరల్​ బ్యాంక్​లు ఉన్నాయి. త్రైమాసిక ఫలితాల ఆధారంగా ఆయా కంపెనీల షేర్లు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలున్నాయి.

కేంద్ర బడ్జెట్​పై వెలువడే అంచనాలు ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లపై ప్రధానంగా ప్రభావం చూపనున్నట్లు జియోజిత్​ ఫినాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు.

వీటన్నింటితో పాటు.. రూపాయి, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చూడండి:బిట్​కాయిన్​లో పెట్టుబడులా? జర ఆలోచించండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.