ETV Bharat / business

20 లక్షల భారతీయుల వాట్సాప్​ ఖాతాలపై నిషేధం!

author img

By

Published : Dec 2, 2021, 6:52 AM IST

WhatsApp account banned: వేధింపులను అరికట్టే చర్యల్లో భాగంగా 20 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించింది వాట్సాప్. అక్టోబర్​లో సంస్థకు ఐదు వందల ఫిర్యాదులు అందినట్లు తెలిపింది.

whatsapp account banned
whatsapp account banned

WhatsApp account banned: అక్టోబర్​లో 20 లక్షల భారతీయుల ఖాతాలపై నిషేధం విధించింది దిగ్గజ మెసేజింగ్​ సంస్థ వాట్సాప్. ఆ నెలలో సంస్థకు 500 ఫిర్యాదు నివేదికలు అందినట్లు తెలిపింది. వేధింపులను అరికట్టడం సహా యూజర్ల భద్రత కోసం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు కంప్లయన్స్​ రిపోర్ట్​లో వివరించింది.

95 శాతానికి పైగా ఖాతాలను.. బల్క్​ మెసేజింగ్​ను దుర్వినియోగం చేసినందువల్లే బ్యాన్ చేసినట్లు వాట్సాప్ తెలిపింది. ఈ వేదికపై వేధింపులను అరికట్టేందుకు నెలవారీగా సుమారు 80 లక్షల ఖాతాలను నిషేధిస్తోంది వాట్సాప్. సెప్టెంబర్​లోనూ 560 ఫిర్యాదు నివేదికలు అందగా, 22 లక్షల భారతీయుల ఖాతాలను నిలిపేసింది.

ఇదీ చూడండి: నంబర్ సేవ్​ చేయకుండా వాట్సాప్​లో మెసేజ్​ చేయండిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.