ETV Bharat / business

గుజరాత్​ 'గిఫ్ట్​ సిటీ'లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు

author img

By

Published : Feb 1, 2022, 8:40 PM IST

FM On GIFT City: గుజరాత్​లోని గిఫ్ట్​ సిటీలో విదేశీ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలను అనుమతించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వీటిల్లో ఆర్థిక నిర్వహణ, ఫిన్‌టెక్‌, శాస్త్ర, సాంకేతికత వంటి కోర్సులను అందించనున్నట్లు వెల్లడించారు. వ్యాపార రంగంలోకి ప్రతిభతో కూడిన మరింత మంది వచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

nirmala sitaraman
నిర్మలా

FM On GIFT City: దేశంలో వ్యాపారాలకు ప్రోత్సాహం, పెట్టుబడుల సమీకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కేంద్రం.. ఆ దిశగా మౌలిక సదుపాయాల కల్పనపై కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార సంస్థల్లోకి అత్యున్నత ప్రమాణాలు కల్గిన ఉద్యోగులను తీర్చిదిద్దడం సహా వ్యాపార రంగంలోకి ప్రతిభతో కూడిన మరింత మంది వచ్చేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వార్షిక బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు.

గుజరాత్‌లో రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ ఆర్థిక, సాంకేతిక సిటీ.. గిఫ్ట్‌లో ప్రపంచ స్థాయి విదేశీ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలను అనుమతించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

వీటిల్లో ఆర్థిక నిర్వహణ, ఫిన్‌టెక్‌, శాస్త్ర, సాంకేతికత వంటి కోర్సులను అందించనున్నట్లు వెల్లడించారు. ఈ విద్యాసంస్థలపై గిఫ్ట్‌ అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రానికి తప్ప దేశీయంగా ఎలాంటి నియంత్రణ ఉండబోదని స్పష్టం చేశారు. తద్వారా అత్యున్నతస్థాయి మానవ వనరులు అందుబాటులోకి వస్తాయని నిర్మలా సీతారామన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

"గుజరాత్‌లోని అంతర్జాతీయ ఆర్థిక, సాంకేతిక సిటీ.. ఐ.ఎఫ్‌.ఎస్‌.సి గిఫ్ట్‌ సిటీలో ప్రపంచ స్థాయి విదేశీ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలను అనుమతిస్తాం. వీటి ద్వారా ఆర్థిక నిర్వహణ, ఫిన్‌టెక్‌, శాస్త్ర, సాంకేతిక రంగ కోర్సులు, ఇంజినీరింగ్‌, గణిత శాస్త్రం కోర్సులను అందిస్తాం. ఆర్థిక, సాంకేతిక రంగంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన మానవ వనరులను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలపై ఐ.ఎఫ్‌.ఎస్‌.సికి తప్ప దేశీయంగా ఎలాంటి నియంత్రణ లేకుండా చేస్తాం."

-- నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థిక మంత్రి

అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం..

దేశంలోని వ్యాపార సంస్థల మధ్య అంతర్జాతీయ స్థాయి వివాదాలు పరిష్కారం కాక వ్యాపార కార్యకలాపాలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నందున ఈ చిక్కుముడులను పరిష్కరించే దిశగా ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేశారు. గిఫ్ట్​ సిటీలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

"అంతర్జాతీయ న్యాయ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో.. వ్యాపార సంస్ధల మధ్య వివాద పరిష్కారానికి గిఫ్ట్‌ సిటీలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. దేశంలో సుస్ధిర, ఆర్థిక వాతావరణాన్ని సృష్టించేందుకు.. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు గిఫ్ట్‌ సిటీలో సేవలు అందిస్తాం."

-- నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థిక మంత్రి

అంతర్జాతీయ ఆర్థిక, సాంకేతిక సేవల కోసం గుజరాత్‌ గాంధీనగర్‌లో రూపుదిద్దుకుంటున్న గిఫ్ట్‌ సిటీ దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్‌ స్మార్ట్‌ సిటీగా గుర్తింపు పొందింది.

ఇవీ చూడండి: రాష్ట్రాలకు లక్ష కోట్ల సాయం- వడ్డీ లేని రుణం!

Union budget 2022: నవ భారత్​ కోసం 'బూస్టర్​ డోస్​' బడ్జెట్​!

'డిజిటల్ రూపీ' కథేంటి? కొత్త కరెన్సీతో లాభాలుంటాయా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.