ETV Bharat / business

పెరుగుతున్న యాంత్రీకరణ- ఉద్యోగుల్లో ఆందోళన

author img

By

Published : Mar 18, 2021, 7:46 AM IST

యాంత్రీకరణ​ కారణంగా 40 శాతం మంది ఉద్యోగులు ఆందోళన చెందుకున్నారు. తమ ఉద్యోగాలు గల్లంతయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 21 దేశాల్లో చేపట్టిన పీడబ్ల్యూసీ సర్వే ఈ విషయాలను వెల్లడించింది.

job
మా ఉద్యోగాలు ఉండవేమో..

కరోనా మహమ్మారి నేపథ్యంలో పెరుగుతున్న యాంత్రీకరణ (ఆటోమేషన్) వల్ల వచ్చే 5 ఏళ్లలో తమ ఉద్యోగాలు గల్లంతయ్యే అవకాశం ఉందని 40 శాతం మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జనవరి 26- ఫిబ్రవరి 8 మధ్య పీడబ్ల్యూసీ భారత్, చైనా సహా 19 దేశాల నుంచి 32,500 మందితో నిర్వహించిన సర్వే ఈ మేరకు వివరించింది. మారుమూల ప్రాంతాల నుంచి (రిమోట్​ వర్కింగ్) పని చేసేందుకు మారడం కూడా ప్రమాదకర పరిణామంగానే ఉద్యోగులు భావిస్తున్నారు.

  • ఆటోమేషన్​తో చాలా ఉద్యోగాలకు ప్రమాదం పొంచిఉందని 60 శాతం మంది పేర్కొన్నారు. సంప్రదాయ ఉపాధి అవకాశాలు భవిష్యత్తులో ఉండకపోవచ్చని 48 శాతం మంది పేర్కొన్నారు. వచ్చే 5 ఏళ్లలో తమ ఉద్యోగాల ఉనికి ప్రశ్నార్థకం కావొచ్చని 39 శాతం మంది అభిప్రాయపడ్డారు.
  • లాక్​డౌన్​తో తమ డిజిటల్ నైపుణ్యాలు మెరుగయ్యాయని 40 శాతం మంది వెల్లడించారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు 77 శాతం మంది సిద్ధంగా ఉన్నారు.
  • పని ప్రదేశాల్లో కొత్త సాంకేతికతల్ని స్వీకరించడానికి 80 శాతం మంది సిద్ధంగా ఉన్నారు. భారత్​లో 69 శాతం మంది దక్షిణాఫ్రికాలో 66 శాతం మంది ఈ విషయాలలో చాలా విశ్వాసంతో ఉన్నారు.
  • సొంతంగా వ్యాపారం స్థాపించాలనే ఆసక్తితో వ్యవస్థాపక నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై 49 శాతం మంది దృష్టి సారిస్తున్నారు.
  • పని ప్రదేశంలో ఎదుర్కొంటున్న వివక్ష వల్ల కెరీర్​ పురోగతి, శిక్షణ కోల్పోతున్నామని 50 శాతం మంది పేర్కొన్నారు. జాతి వివక్ష కారణమని 13 శాతం మంది, లింగ వివక్ష ఉందని 14 శాతం మంది వెల్లడించారు.
  • సమాజానికి సహకరించే సంస్థల్లో పని చేయాలని 75 శాతం మంది ఉద్యోగులు కోరుకుంటున్నారు.

ఇదీ చదవండి : పసిడి కాస్త ప్రియం- దిగొచ్చిన వెండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.