ETV Bharat / bharat

Viral Video : మహబూబాబాద్​ జిల్లాలో విచిత్రం.. చిన్నారి కంట్లో నుంచి నీటికి బదులు..?

author img

By

Published : May 20, 2023, 2:13 PM IST

మహబూబాబాద్​ జిల్లాలో విచిత్రం
మహబూబాబాద్​ జిల్లాలో విచిత్రం

Plastic Coming out From a Girl's Eye in Mahabubabad : శరీర అవయవాల్లో నేత్రాలు ఎంతో సున్నితమైనవి. చిన్న దుమ్ముధూళి కణాలు కళ్లలో పడితేనే విలవిలలాడుతుంటాం. కంటిలో చుక్కలు వేయాలన్నా..ఏదైనా నలుసును తీయాలన్నా ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అలాంటి కన్ను నుంచి విచిత్రంగా వస్తువులు బయటపడుతున్నాయంటే వినటానికే నమ్మశక్యంగా ఉండదు. మహబూబాబాద్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

బాలిక కంటి నుంచి విచిత్రంగా బయటికి వస్తున్న వస్తువులు

Plastic Coming out From a Girl's Eye in Mahabubabad : రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. కానీ వారి కూతురు కంట్లో నుంచి విచిత్రంగా బయటకు వస్తున్న వస్తువులను చూసి వారు ఆందోళనకు గురువుతున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కురవి మండలం రాజోలు గ్రామ శివారు తండాకు చెందిన 'దస్రు - సుగుణ' దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి ఇళ్లు గడవటం ఇబ్బందిగా మారటంతో కుమార్తె సౌజన్యబాయిని గార్ల మండలం పెద్దకిష్టాపురంలోని అమ్మమ్మ ఇంటికి పంపించి చదివిస్తున్నారు.

Hair Coming out From a Girl's Eye in Mahabubabad : మూణ్నెళ్ల క్రితం ఓ రోజు కంటిలో నొప్పి వస్తుండటంతో చిన్నారి.. కుటుంబీకులకు చెప్పింది. ఈ క్రమంలోనే కుడి కంటిలో నుంచి విచిత్రంగా వ్యర్థాలు బయటికి రావటాన్ని చూసి.. కుటుంబసభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. మూడు నెలలుగా బాలిక కన్నులో నుంచి దూది పుల్లలు, చీమలు, వెంట్రుకలు, బియ్యం గింజలు, గోర్లు, పేపర్ ముక్కలు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో తీవ్ర ఆందోళనకు గురై స్థానికంగా ఆస్పత్రికి తీసుకువెళ్లినా.. ఎలాంటి సమస్యలేదని వైద్యులు చెప్పినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.

"గత 3 నెలలుగా తమ కూతురు కుడి కంటి నుంచి దూది (పత్తి) పుల్లలు, చీమలు, వెంట్రుకలు, బియ్యం గింజలు, గోర్లు, పేపర్ ముక్కలు, ప్లాస్టిక్ వ్యర్ధాలు వస్తున్నాయి. తండా వాసులంతా కంట్లో నుండి వస్తువులు రావడాన్ని విచిత్రంగా చూస్తున్నారు. వచ్చేముందు కొద్దిగా నొప్పిగా ఉంటుంది. ఖమ్మం, మహబూబాబాద్​​లోని ఆస్పత్రిలో చూపించాం, డాక్టర్లు ఏమీ లేదని చెప్పారు. కానీ అలాగా వస్తున్నాయి. పెద్ద ఆసప్రతుల్లో చూపించుకునే స్థోమత మాకు లేదు. ప్రభుత్వం గానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం." - దస్రు, బాలిక తండ్రి

తరచుగా ఇలా వస్తువులు బయటికి రావటాన్ని చూసి భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు.. పాపను ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇలా కంట్లో నుంచి వస్తువులు ఎందుకు బయటకు వస్తున్నాయో వైద్యులకు కూడా అంతుపట్టడం లేదు. మెరుగైన వైద్యం విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.