కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణం.. డిప్యూటీగా డీకే.. మంత్రులు ఎందరంటే?

author img

By

Published : May 20, 2023, 12:45 PM IST

Updated : May 20, 2023, 2:27 PM IST

siddaramaiah-sworn-in-as-chief-minister-of-karnataka-and-dk-shivakumar-as-deputy-chief-minister

కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్​ ప్రమాణస్వీకారం చేశారు. ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కార్యక్రమానికి కాంగ్రెస్​ అగ్ర నేతలతో పాటు విపక్ష పార్టీల నేతలు సైతం హాజరయ్యారు.

కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఏకైక ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్​ ప్రమాణం చేశారు. వీరితో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సైతం మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో శనివారం మధ్యాహ్నం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డాక్టర్ జి పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, కెజె జార్జ్, ఎంబి పాటిల్, సతీష్ జార్కిహోళి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్ ఖాన్​ సైతం రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

siddaramaiah-sworn-in-as-chief-minister-of-karnataka-and-dk-shivakumar-as-deputy-chief-minister
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం

కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీతో సహా కీలక నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్​ పాలిత ముఖ్యమంత్రులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విపక్ష పార్టీల నేతలు సైతం హాజరయ్యారు. బిహార్​ ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్​, తమిళనాడు సీఎం ఎం​కే స్టాలిన్​, ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరితో పాటు ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరైన్​, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా సైతం కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. కాంగ్రెస్​ పార్టీ మాజీ అధ్యక్షురాలు మాత్రం కార్యక్రమానికి గౌర్హజరయ్యారు.

siddaramaiah-sworn-in-as-chief-minister-of-karnataka-and-dk-shivakumar-as-deputy-chief-minister
ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్​ ప్రమాణం స్వీకారం

బిహార్​ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్​, శివసేన(యూబీటీ) చీఫ్​ ఉద్ధవ్​ థాక్రే, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​ సైతం కార్యక్రమానికి హాజరయ్యారు. టీఎం​సీ తరపున ఆ పార్టీ ఎంపీ కాకాలి ఘోష్ దస్తిదార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు.

siddaramaiah-sworn-in-as-chief-minister-of-karnataka-and-dk-shivakumar-as-deputy-chief-minister
కార్యక్రమంలో నేతలు

కార్యక్రమం అనంతరం రాహుల్​ గాంధీ మాట్లాడారు. కర్ణాటకలో స్వచ్ఛమైన, అవినీతి రహిత పాలన అందిస్తామని ప్రజలకు అయన హామీ ఇచ్చారు. "కర్ణాటకలో కాంగ్రెస్​ గెలిచిన తరువాత.. పార్టీ విక్టరీపై చాలా కథనాలు, విశ్లేషణలు వచ్చాయి. కానీ కాంగ్రెస్​ పేదలు, దళితలు, ఆదివాసిలు, వెనుకబడిన వర్గాల పైపు నిలబడినందుకే పార్టీ గెలిచిందని నేను చెప్పాలనుకుంటున్నాను. కాంగ్రెస్​ పార్టీకి పేద ప్రజలు అండగా ఉన్నారు. కాంగ్రెస్ పక్షాన నిజం ఉంది. బీజేపీకి డబ్బు ఉంది. పోలీసులూ అండగా ఉన్నారు. అయినా ప్రజలు బీజేపీని ఓడించారు" అని రాహుల్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్​ పార్టీ మీకు ఐదు వాగ్దానాలు చేసిందని.. అవి కర్ణాటక ప్రభుత్వ మొదటి క్యాబినెట్ సమావేశంలోనే చట్టంగా మారుతాయని రాహుల్ గాంధీ ప్రకటించారు.

siddaramaiah-sworn-in-as-chief-minister-of-karnataka-and-dk-shivakumar-as-deputy-chief-minister
కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడుతున్న రాహుల్​ గాంధీ

మే 10న విడుదలైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 224 స్థానాలకు గాను కాంగ్రెస్ 136 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 66 స్థానాలు గెలుచుకుంది. జేడీఎస్​ 19 స్థానాలుకు పరిమితమైంది.

siddaramaiah-sworn-in-as-chief-minister-of-karnataka-and-dk-shivakumar-as-deputy-chief-minister
కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం హాజరైన రాహుల్​, ప్రియాంక
Last Updated :May 20, 2023, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.