ETV Bharat / bharat

'ఆ కట్టడాలు, రోడ్ల పేర్లు మార్చేందుకు ప్రత్యేక కమిషన్'.. సుప్రీం కీలక నిర్ణయం

author img

By

Published : Feb 27, 2023, 2:39 PM IST

పురాతన, మతపరమైన స్థలాల పేర్లను మార్చేందుకు 'పేర్లు మార్చే కమిషన్'​ను ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆక్రమణదారుల పేర్లు ఇంకా కొనసాగించడం దేశ సార్వభౌమాధికారం, ఇతర పౌర హక్కులకు విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు.

renaming commission on supreme court
మతపరమైన స్థలాల పేర్లు మార్పు

పురాతన, మతపరమైన స్థలాల పేర్లను మార్చేందుకు 'పేర్లు మార్చే కమిషన్' ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ఈ పిల్​ను జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం పరిశీలించింది. వాదనలు వినేందుకు నిరాకరించింది. 'భారత్​ను విదేశీ శక్తులు ఆక్రమించి పాలించిన మాటమే వాస్తవమే. దేశ చరిత్ర.. ప్రస్తుత, భవిష్యత్తు తరాలను వెంటాడకూడదు' అని ధర్మాసనం పేర్కొంది.

'భారత్ లౌకిక దేశం. హిందూ మతం అనేది భారతీయుల జీవన విధానం. ఇది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. దానిలో ఎటువంటి మతోన్మాదం లేదు. దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంది. అయితే క్రూరమైన విదేశీ ఆక్రమణదారులు, వారి అనుచరులు, కుటుంబ సభ్యుల పేరుతో అనేక పురాతన కట్టడాలు, మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి.'

--అశ్విని ఉపాధ్యాయ్, పిటిషనర్​

విదేశీ ఆక్రమణదారుల వల్ల మారు పేర్లు పొందిన పురాతన, చారిత్రక, సాంస్కృతిక, మతపరమైన ప్రదేశాల అసలు పేర్లను పెట్టేందుకు 'పేర్లు మార్చే కమిషన్'ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ఉపాధ్యాయ్ ఫిబ్రవరి మొదట్లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమణదారుల పేర్లు ఇంకా కొనసాగించడం సార్వభౌమాధికారం, ఇతర పౌర హక్కులకు విరుద్ధమని పిటిషన్​లో​ పేర్కొన్నారు. ఇటీవల మొఘల్ గార్డెన్‌కు అమృత్ ఉద్యాన్‌గా నామకరణం చేశారు. అదే తరహా పేర్లతో ఉన్న రోడ్ల విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

రాజ్​పథ్​ పేరు మార్పు..
ఏటా గణతంత్ర దినోత్సవాన దేశ సైనికశక్తి ప్రదర్శనకు వేదికగా నిలిచే రాజ్‌పథ్‌ పేరును కర్తవ్యపథ్‌గా మార్చారు. ఇండియా గేట్‌ వద్ద ఉన్న నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న మార్గాన్ని ఇకపై కర్తవ్యపథ్‌గా పిలుస్తారు. వలసవాద విధానాలు, చిహ్నాలు మార్చాలన్న విధానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి మీనాక్షి లేఖి తెలిపారు. బ్రిటిష్‌వారి కాలంలో కింగ్స్‌వే అని పిలవగా స్వాతంత్ర్యం తర్వాత రాజ్‌పథ్‌గా నామకరణం చేశారు. ఇప్పుడు కర్తవ్యపథ్‌గా మారింది.

వలసవాద పేర్లు, చిహ్నాలను రద్దు చేస్తామని 2022 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఉద్ఘాటించగా అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పే‌ర్లు మార్పు చేపట్టింది. ప్రధాని నివాసం ఉండే రేస్‌కోర్స్‌ రోడ్‌ పేరును లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌గా 2015లో మార్చారు. ఔరంగజేబు రోడ్డును ఏపీజే అబ్దుల్‌ కలాం రోడ్డుగా.. డల్హౌసీ రోడ్డును దారా శిఖో రోడ్డుగా నామకరణం చేశారు. 2018లో తీన్‌మూర్తీ చౌక్‌ పేరును తీన్‌ మూర్తీ హైఫాగా మార్చారు. అయితే అక్బర్‌ రోడ్డు పేరును కూడా మార్చాలని ప్రతిపాదనలు వచ్చినా ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.