ETV Bharat / bharat

రిక్షా డ్రైవర్​కు ఐటీ నోటీసులు.. రూ. 3కోట్లు పన్ను ఎగవేత ఆరోపణలు

author img

By

Published : Oct 25, 2021, 10:31 AM IST

Updated : Oct 25, 2021, 11:43 AM IST

mathura news today
రిక్షా డ్రైవర్​కు ఐటీ నోటీసులు.. రూ. 3కోట్లు పన్నుఎగవేత ఆరోపణలు

ఉత్తర్​ప్రదేశ్​ మథురా జిల్లాలోని బకల్​పుర్​ గ్రామానికి ఐటీశాఖ అధికారులు వెళ్లి ఓ వ్యక్తికి నోటీసులిచ్చారు. అతడు రూ.3కోట్ల పన్నుఎగవేతకు పాల్పడ్డాడడని ఆ నోటీసుల్లో ఉంది. అయితే ఆ వ్యక్తి ఓ సాధారణ రిక్షా డ్రైవర్​ కావడం గమనార్హం.

ఉత్తర్​ప్రదేశ్​ మథురా జిల్లాలో రిక్షా నడుపుకుంటూ బతుకుదెరువు సాగిస్తున్నాడు ప్రతాప్​ సింగ్​. బకల్​పుర్​ గ్రామంలో నివాసముంటున్న ప్రతాప్​ సింగ్​ కుటుంబం.. ఆయన మీదే ఆధారపడి జీవిస్తోంది. ఈ నెల 19న అతడి ఇంటికి ఐటీశాఖ అధికారులు వెళ్లారు. ప్రతాప్​ సింగ్​.. రూ.3కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్టు నోటీసులుచ్చారు. అది చూసి ప్రతాప్​ సింగ్​ ఒక్కసారిగా షాక్​ అయ్యాడు. రిక్షా నడుపుకుంటూ జీవించే తన దగ్గర అంత మొత్తం ఎలా ఉంటుందని ఆశ్చర్యపోయాడు.

ఈ విషయంపై ఓ న్యాయవాదిని సంప్రదించాడు ప్రతాప్​ సింగ్​. అనంతరం హైవే పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

rickshaw-driver
బాధితుడు ప్రతాప్​ సింగ్​
rickshaw-driver
ఐటీ నోటీసులు

"నాకు ఇటీవలే పాన్​ కార్డు వచ్చింది. దాని కోసం నానా కష్టాలు పడాల్సి వచ్చింది. నాలుగు నెలలు తిరిగాల్సి వచ్చింది. చివరికి పాన్​ దక్కింది. అది వచ్చిన కొన్ని రోజులకే ఐటీశాఖ అధికారులు వచ్చారు. నేను రూ. 3కోట్లు పన్నుఎగవేతకు పాల్పడ్డానని అంటున్నారు. నేను రిక్షా నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఆదాయపు పన్నుకు నాకు సంబంధం లేదు. పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాను. నాపై తప్పుడు ఆరోపణలు మోపారు."

--- ప్రతాప్​ సింగ్​, రిక్షా డ్రైవర్​.

బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు పోలీసులు. ఐటీశాఖ అధికారులతో కూడా చర్చిస్తున్నట్టు తెలిపారు. అన్నింటినీ పరిగణలోకి తీసుకుని న్యాయం చేస్తామని హామీనిచ్చారు.

rickshaw-driver
పోలీస్​ స్టేషన్​లో..

ఇదీ చూడండి:- ఐటీ దాడుల్లో బయటపడ్డ రూ.750కోట్లు- యడ్డీ కుమారుడి ఫ్రెండ్స్​వే!

Last Updated :Oct 25, 2021, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.