ETV Bharat / bharat

ఐటీ దాడుల్లో బయటపడ్డ రూ.750కోట్లు- యడ్డీ కుమారుడి ఫ్రెండ్స్​వే!

author img

By

Published : Oct 12, 2021, 7:00 PM IST

ఈ నెల 7న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడు విజయేంద్ర సన్నిహితులపై జరిగిన ఐటీ సోదాల్లో.. లెక్కల్లో చూపించని రూ. 750కోట్లు బయటపడ్డాయి. ఇందులో రూ. 487కోట్ల ఆదాయాన్ని తాము లెక్కల్లో చూపించలేదని స్వయంగా ఆయా సంస్థల సభ్యులు అంగీకరించారు.

BY Vijayendra
ఐటీ సోదాలు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడు విజయేంద్ర సన్నిహితులపై జరిగిన ఐటీ దాడుల్లో భారీగా నగదు బయటపడింది. మూడు సంస్థలపై జరిగిన సోదాల్లో.. లెక్కల్లో చూపని ఆదాయం రూ. 750కోట్లుగా తేలింది. ఇందులో రూ. 487కోట్లను లెక్కల్లో చూపించలేదని స్వయంగా ఆ సంస్థలే అంగీకరించాయి. ఈ విషయాన్ని ఆదాయపు పన్నుశాఖ ప్రకటించింది.

నీటి పారుదల, రహదారుల ప్రాజెక్టులకు సంబంధించిన ముగ్గురు కాంట్రాక్టర్ల సంస్థల్లో సోదాలు చేశారు. ఈ నెల 7న నాలుగు రాష్ట్రాల్లోని 47 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. బోగస్​ కొనుగోళ్లు, కార్మికులకు ఖర్చు చేస్తున్నట్టు లెక్కల్లో చూపించి.. ఆదాయాన్ని బయట పెట్టలేదని తనిఖీల్లో తేలింది.

అసలు నిర్మాణ వ్యాపారంతో సంబంధం లేని 40 మంది పేరు చెప్పి సబ్​కాంట్రాక్ట్​ ఖర్చులను చూపించినట్టు దర్యాప్తులో తేలింది. అవకతవకలకు పాల్పడినట్టు సంబంధిత సభ్యులు అంగీకరించారు. ఓ సంస్థ.. కార్మికుల ఖర్చుల పేరుతో రూ. 382కోట్లు వెనకేసుకుంటే.. మరో సంస్థ.. పుస్తకాల్లో లేని కంపెనీల నుంచి కొనుగోళ్లు చేసినట్టు రూ. 105 కోట్లు చూపించింది.
ఈ వ్యవహారానికి సంబంధించిన డాక్యుమెంట్లు, డిజిటల్​ ఆధారాలు, ఇతర ఆధారాలను ఐటీ అధికారులు జప్తుచేశారు. తనిఖీల్లో భాగంగా లెక్కల్లో లేని రూ. 4.69కోట్ల నగదు, రూ. 8.67కోట్లు విలువ చేసే నగలు, రూ. 29.83లక్షలు విలువ చేసే వెండిని జప్తు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం బంధువుల ఇంట్లో ఐటీ సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.