ETV Bharat / bharat

''ప్రికాషన్​ డోసు​'కు కొత్తగా రిజిస్ట్రేషన్​ అవసరం లేదు'

author img

By

Published : Jan 8, 2022, 7:43 AM IST

Precautionary dose registration: ప్రికాషన్​ డోసు తీసుకోవాలంటే మళ్లీ కొత్త రిజిస్ట్రేషన్​ అవసరం లేదని స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న అర్హులైన వారు నేరుగా అపాయింట్​మెంట్​ తీసుకోవటం, వ్యాక్సినేషన్​ కేంద్రానికి వెళ్లి టీకా తీసుకోవచ్చని తెలిపింది.

precautionary dose of COVID-19 vaccine
కరోనా వ్యాక్సినేషన్​

precautionary dose registration: ఒమిక్రాన్​ విజృంభిస్తున్న నేపథ్యంలో జనవరి 10వ తేదీ నుంచి ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్​లైన్​ వర్కర్లు, 60 ఏళ్లుపైబడి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రికాషన్​ డోసు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో.. మళ్లీ రిజిస్ట్రేషన్​ చేసుకోవాలా? లేదా అనే విషయంపై స్పష్టతనిచ్చింది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ.

కొవిడ్​-19 ప్రికాషన్​ డోసు పొందాలనుకుంటున్న లబ్ధిదారులు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్​ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న అర్హులైన వారు నేరుగా అపాయింట్​మెంట్​ తీసుకోవటం లేదా నేరుగా వ్యాక్సినేషన్​ కేంద్రానికి వెళ్లి టీకా తీసుకోవచ్చని తెలిపింది.

" వ్యాక్సినేషన్​ షెడ్యూల్​ను జనవరి 8న విడుదల చేస్తాం. అలాగే శుక్రవారం సాయంత్రం నుంచే ఆన్​లైన్​ అపాయింట్​మెంట్​ అదుబాటులోకి వస్తుంది. వ్యాక్సిన్​ కేంద్రం వద్దే అపాయింట్​మెంట్​ బుక్​ చేసుకోవటం జనవరి 10నుంచి మొదలవుతుంది."

- కేంద్ర ఆరోగ్య శాఖ.

ప్రికాషన్​ డోసు కింద గతంలో తీసుకున్న వ్యాక్సిన్​నే ఇవ్వనున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. కొవాగ్జిన్​ తీసుకున్న వారికి కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ తీసుకున్నవారికి కొవిషీల్డ్​నే ఇవ్వనున్నట్లు నీతి ఆయోగ్​ సభ్యులు డాక్టర్​ వీకే పాల్​ తెలిపారు.

ఏంటి ఈ ప్రికాషన్​ డోసు?

ప్రికాషన్​ డోసుకు ప్రస్తుతం సరైన నిర్వచనం లేదు. టీకా రెండు డోసులు తీసుకున్నవారు.. మూడో డోసుగా వేరే రకం వ్యాక్సిన్​ను తీసుకోవడాన్ని ప్రికాషన్​ డోసు అనొచ్చని కొవిడ్​ వ్యాక్సినేషన్​ సాంకేతిక బృందం చెబుతోంది. అంటే.. కొవాగ్జిన్​ టీకాలు తీసుకున్నవారికి మరో డోసుగా.. ఇతర వ్యాక్సిన్లు ఇవ్వడం అని అర్థం! ఇదే నిజమైతే.. మూడో డోసు తీసుకున్నామంటే.. అది పూర్తిగా కొత్త టీకా అవుతుంది.

రెండో డోసు తీసుకున్న తర్వాత 9 నుంచి 12 నెలలకు ప్రికాషన్ డోసు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టీకా పంపిణీపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం ఈ మేరకు కాలవ్యవధిపై సమాలోచనలు చేస్తోంది. శాస్త్రీయ పద్ధతుల్లో అంచనా వేసి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: మోదీ చెప్పిన 'ప్రికాషన్​ డోసు'కు అర్థమేంటి? బూస్టర్​ కాదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.