ETV Bharat / bharat

భూమిలో నోట్ల కట్టలు.. ట్రాక్టర్​తో దున్నుతుంటే బయటకు.. పోలీసులు వచ్చేలోపే..

author img

By

Published : Jun 28, 2022, 2:43 PM IST

Old currency notes: ట్రాక్టర్​తో పొలం దున్నుతున్న ఓ వ్యక్తికి పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు కనిపించాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు పొలంవైపు పరిగెత్తారు. క్షణాల్లో ఎవరికివారు దొరికినంత తీసుకుని పరారయ్యారు. కానీ ఆ డబ్బు చెల్లదు. ఎందుకంటే వారు తీసుకెళ్లింది రద్దు చేసిన పాత కరెన్సీని. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

పాతకరెన్సీ
పాతకరెన్సీ

పొలంలో పాతకరెన్సీ నోట్లు

Old currency notes: రోడ్డు మీద కరెన్సీ నోటు కనిపిస్తే చాలా మంది వెంటనే జేబులో వేసుకుంటూ ఉంటారు. కానీ అది ఒకవేళ రద్దు చేసిన పాత నోటు అయితే? ఎవరూ దాని జోలికి కూడా వెళ్లరు. కానీ బిహార్​లోని ఆ గ్రామంలో జననానికి మాత్రం కొత్త, పాత నోట్లతో సంబంధం లేదు. పొలంలో డబ్బు ఉందని తెలియగానే ఎగబడ్డారు. పోలీసులు వచ్చేలోపే వీలైనంత తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

ఇదీ జరిగింది: పట్నా జిల్లా పసౌడా గ్రామంలో అజయ్​ సింగ్​ తన పొలాన్ని దున్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ ట్రాక్టర్​ డ్రైవర్​కు పాత కరెన్సీ నోట్లు ఉన్న ఓ మూట పొలంలో దొరికింది. అజయ్​ సింగ్​ ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అయితే అప్పటికే ఈ విషయం చుట్టపక్కల వారికి తెలియగా.. అవి పాతనోట్లు అని లెక్కచేయకుండా వాటి కోసం ఎగబడ్డారు. వీలైనన్ని నోట్లు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

పొలంలో దొరికిన పాతకరెన్సీ నోట్లు
పొలంలో దొరికిన పాతకరెన్సీ నోట్లు

పోలీసుల ఈ విషయం తెలుసుకుని అక్కడి వచ్చేసరికి చాలా నోట్లు మాయమయ్యాయి. పొలం వద్ద మిగిలిన కొన్ని నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. రూ.500, రూ.1000 నోట్ల కట్టలతో ఉన్న మూటను పొలంలో ట్రాక్టర్​ డ్రైవర్​ గుర్తించాడని.. ఈ డబ్బు ఎవరిది? ఇక్కడ ఎందుకు దాచారు? అనే కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. నోట్లు తీసుకుని పరారైన వారిని కూడా గుర్తించి డబ్బులను స్వాధీనం చేసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : నడిరోడ్డులో యువకుడిపై కాల్పులు.. పోలీస్​ సస్పెండ్​.. ఏం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.