ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఐదుగురు ఉగ్రవాదులు హతం

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 11:54 AM IST

Updated : Nov 17, 2023, 2:20 PM IST

Jammu Kashmir Encounter Today : జమ్ముకశ్మీర్​లో భద్రతా దళాలకు, ముష్కరులకు మధ్య ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతిచెందిన వారిని లష్కరే తొయిబా ఉగ్రసంస్థకు చెందినవారిగా అధికారులు గుర్తించారు.

Jammu Kashmir Encounter Today
Jammu Kashmir Encounter Today

Jammu Kashmir Encounter Today : జమ్ముకశ్మీర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కశ్మీర్​లోని కుల్​గామ్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. భద్రతాదళాలు, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్​లో మృతిచెందిన ముష్కరులను లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.

అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. జమ్ముకశ్మీర్​ కుల్​గామ్​ జిల్లా నెహామా ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న సమాచారం భద్రతా బలగాలకు గురువారం అందింది. పోలీసులు, సీఆర్​పీఎఫ్, ఆర్మీకి చెందిన 34 రాష్ట్రీయ రైఫిల్స్​ బృందాలు, 9 పారామిలటరీ బృందాలు ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో తనిఖీలు జరుపుతున్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్​కౌంటర్​గా మారింది. గురువారం ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. రాత్రి వేళ కాల్పులకు విరామం ఇచ్చిన భద్రతా సిబ్బంది.. ఆ ప్రాంతం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా పహారా కాశారు.

ఎన్​కౌంటర్​లో ఐదుగురు ముష్కరుల హతం
Jammu Kashmir Encounter 5 Terrorists Killed : శుక్రవారం ఉదయం ఓ ఇంట్లో నుంచి ముష్కరులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. వారి కాల్పులకు భద్రతా బలగాలు దీటుగా స్పందించాయి. ఈ ఎన్​కౌంటర్​లో ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లుగా అధికారులు ధ్రువీకరించారు. కాల్పుల్లో చనిపోయిన ఐదుగురు లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారని గుర్తించారు.

కుల్​గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం ఇంటెలిజన్స్​ విభాగం నుంచి మా భద్రతా బలగాలకు అందింది. సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఓ ఇంటి నుంచి ముష్కరులు కాల్పులు జరిపారు. వారిపై మా భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు.

-విధి కుమార్​ బిల్ది, ఐజీపీ, కశ్మీర్​

డ్రోన్ల ద్వారా మృతదేహాలను..
డ్రోన్ల ద్వార ఐదుగురు ముష్కరుల మృతదేహాలను గుర్తించామని.. వాటిని వెలికితీసి ఆ ప్రాంతాన్ని శానిటైజ్​ చేస్తున్నామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఆపరేషన్​ ఇంకా కొనసాగుతోందని అధికారులు చెప్పారు.

పుల్వామాలో భారీ ఎన్​కౌంటర్​.. లష్కరే టాప్​ కమాండర్​ హతం!

జమ్ము కశ్మీర్‌లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు ముష్కరుల హతం

Last Updated :Nov 17, 2023, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.