ETV Bharat / bharat

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

author img

By

Published : Apr 25, 2022, 9:33 AM IST

Corona Cases In India
Corona Cases In India

Corona Cases In India: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 2,541 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 30మంది వైరస్​కు బలయ్యారు.

Corona Cases In India: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గింది. మరో 2,541 మందికి పాజిటివ్​గా తేలింది. వైరస్ కారణంగా కొత్తగా 30మంది ప్రాణాలు కోల్పోయారు. 1862 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 60వేల పైకి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 23వేలకు పైగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.84 శాతానికి పైగా ఉంది.

  • యాక్టివ్ కేసులు: 16,522
  • మొత్తం మరణాలు: 5,22,223
  • మొత్తం కేసులు: 4,30,60,086
  • రికవరీలు: 4,25,21,341

Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. ఆదివారం 3,64,210మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,87,71,95,781కు చేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజు వ్యవధిలో 4,00,058 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 977 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్​ దేశాల్లో కొవిడ్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

  • దక్షిణ కొరియాలో తాజాగా 64,725 కరోనా కేసులు నమోదయ్యాయి. 109 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​​లో తాజాగా 58,954 మంది వైరస్​ సోకింది. మరో 40మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో 56,263 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 79 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో 31,267 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. 22 మంది మృతిచెందారు.
  • అమెరికాలో 12,969 కరోనా కేసులు బయటపడ్డాయి. 19 మంది వైరస్​కు బలయ్యారు.

ఇదీ చదవండి: రామ్​ మందిర్​ ట్రస్ట్​ చీఫ్​ ఆరోగ్యం విషమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.