ETV Bharat / bharat

Covaxin Vaccine: వారికి కొవాగ్జిన్​ ఒక్క డోసు చాలు!

author img

By

Published : Aug 28, 2021, 5:04 PM IST

కొవాగ్జిన్​పై(covaxin india) ఐసీఎంఆర్​ చేసిన అధ్యయంలో(icmr covid) కీలక విషయాలు వెలువడ్డాయి. కొవిడ్​ సోకని వారు టీకా రెండు డోసులు తీసుకుంటే ఉత్పన్నమయ్యే యాంటీబాడీల ప్రతిస్పందనలు.. వైరస్​ బాధితుల్లో ఒక్క డోసు వేసుకుంటేనే కనిపిస్తున్నాయని తేలింది.

icmr
ఐసీఎంఆర్​

కరోనా సోకిన వారు.. కొవాగ్జిన టీకా(covaxin india) ఒక్క డోసు వేసుకుంటే.. అది రెండు డోసులతో సమానమని ఐసీఎంఆర్​(icmr covid) అధ్యయనంలో తేలింది. కొవిడ్​ సోకని వారు రెండు డోసులు వేసుకుంటే ఉత్పన్నమయ్యే యాంటీబాడీల ప్రతిస్పందనలు.. కొవిడ్​ బాధితుల్లో ఒక్క డోసుతోనే వస్తాయని స్పష్టమైంది.

"ఇవి ప్రాథమిక ఫలితాలు మాత్రమే. భారీ స్థాయిలో జనాభాపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది. అక్కడ కూడా ఇదే రుజువైతే.. కొవిడ్​ బాధితులకు బీబీవీ152(కొవాగ్జిన్​ కోడ్​నేమ్​) టీకా సింగిల్​ డోసును సిఫార్సు చేయవచ్చు. ఇదే జరిగితే.. టీకాలు ఎక్కువగా అందుబాటులో ఉండి.. అందరికీ లభించే అవకాశం పెరుగుతుంది."

--- ఐసీఎంఆర్​.

ఈ అధ్యయనం ఇండియన్​ జర్నల్​ ఆఫ్​ మెడికల్​ రీసెర్చ్​లో శనివారం ప్రచురితమైంది. 2021 ఫిబ్రవరి- మే మధ్యలో చెన్నైలో కొవాగ్జిన్​ తీసుకున్న 114 మంది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలపై ఈ అధ్యయనం జరిగింది.

తొలి డోసు తీసుకునే ముందు రోజు, టీకా తీసుకున్న 28వ రోజు, 56వ రోజున యాంటీబాడీల ప్రతిస్పందనలు ఏ విధంగా ఉన్నాయన్న కోణంలో ఈ అధ్యయనం జరిగింది. అనంతరం వైరస్​ సోకిన వారిలో యాంటీబాడీల ప్రతిస్పందనలను, కొవిడ్​ అంటుకోని వారితో పోల్చిచూశారు. ఇద్దరిని మినహాయిస్తే.. వైరస్​ సోకిన అందరిలోనూ ఒకే డోసుతో యాంటీబాడీల ప్రతిస్పందనలు మెరుగ్గా ఉన్నట్టు అధ్యయనంలో వెల్లడైంది.

దేశీయంగా రూపొందించిన తొలి కరోనా టీకా కొవాగ్జిన్​ అత్యవసర వినియోగానికి జనవరిలో అనుమతులు లభించాయి. ప్రస్తుతానికి 4-6 వారాల వ్యవధిలో రెండు టీకాలు ఇస్తున్నారు.

వచ్చే నెలలో ఆమోదం!

కరోనా కట్టడికి భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌ టీకాకు త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్​ఓ) అనుమతి లభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది(who covaxin approval status). వచ్చే నెలలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొవాగ్జిన్‌ టీకాకు సంబంధించిన ప్రీ-సబ్‌మిషన్‌ సమావేశాన్ని డబ్ల్యూహెచ్​ఓ ఇప్పటికే పూర్తి చేసింది. డోసియర్‌ను ఆమోదించడం సహా రోలింగ్‌ డేటా పరిశీలనను ఈ నెలలో ప్రారంభించింది. తుది నిర్ణయం తీసుకోవడమే మిగిలి ఉందని తెలిసింది.

సైడ్​ ఎఫెక్ట్స్​ తక్కువే..

భారత్​లో కరోనా టీకా తీసుకున్న వారిలో ఎక్కువమందికి ఎలాంటి దుష్ప్రభావాలు(Vaccine Side Effects) కలగలేదని లోకల్​ సర్కిల్స్ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. కొంత మందిలో మాత్రం స్వల్ప జ్వరం వంటి లక్షణాలు కనిపించినట్లు స్పష్టమైంది.

సర్వే ప్రకారం.. కొవాగ్జిన్ తొలి డోసు తీసుకున్న 64 శాతం మందిలో చాలావరకు సైడ్​ ఎఫెక్ట్స్ లేవు. కొవాగ్జిన్ టీకా రెండో డోసు తీసుకున్న 2 శాతం మందికి కరోనా సోకింది. 3 శాతం మందిలో జ్వరం కంటే తీవ్రమైన అనారోగ్య లక్షణాలు కన్పించాయి.

ఇదీ చూడండి:- Delta Variant: వ్యాక్సిన్​ తీసుకున్నా 'డెల్టా' ముప్పు.. కానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.