ETV Bharat / bharat

Horoscope Today: 'సంక్రాంతి' రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

author img

By

Published : Jan 15, 2023, 6:22 AM IST

Horoscope Today : ఈ రోజు (జనవరి 15) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

january-15-2023-horoscope
జనవరి 15 2023 రాశీఫలాలు

Horoscope Today : ఈ రోజు (జనవరి 15) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

.

మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.

.

మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.అభివృద్ధి గురించి ఆలోచిస్తారు.విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.అపోహలతో కాలాన్ని వృథా చేయకండి.ఈశ్వరదర్శనం శుభప్రదం.

.

ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు.తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి.బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

.

ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు అధికం అవుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కనకధారాస్తవం చదవాలి.

.

పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఒక వ్యవహారంలో నైతికవిజయం సాధిస్తారు.ఆర్ధికంగా మేలైన ఫలితాలు ఉన్నాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.ఇష్టదైవ ఆరాధన మరింత శుభాన్ని ఇస్తుంది.

.

ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి.ఆరోగ్య నియమాలను పాటించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శుభకరం.

.

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలంతో ముందుకు సాగాలి. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. శివారాధన చేయాలి.

.

అదృష్ట కాలం. బుద్ధిబలంతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కలహాలకు తావివ్వరాదు. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

.

ప్రారంభించిన పనులను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయులతో వాగ్వాదాలు తగదు. భయాందోళనలను విడనాడాలి. చెడ్డవాళ్లతో సావాసం చేయడం వల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. దుర్గాస్తుతి చదవాలి.

.

ప్రయత్న కార్యసిద్ధి కలదు.కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి.ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మాటపట్టింపులకు పోవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీలక్ష్మీదేవి ఆరాధన శ్రేయోదాయకం.

.

ఉత్సాహంగా పనిచేసి చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆర్ధిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి.అనవసర ప్రయాణాల వల్ల సమయం వృధా అవుతుంది. బంధు,మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. కలహాలకు తావివ్వరాదు. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది.

.

ప్రారంభించిన కార్యక్రమాల్లో శ్రమపెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి.మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.