ETV Bharat / bharat

'కృషి, పట్టుదలతో ఎవరినైనా ఓడించవచ్చు'

author img

By

Published : Mar 27, 2021, 5:50 PM IST

నిరంతర కృషి, పట్టుదలతో బలమైన ప్రత్యర్థిని కూడా ఓడించవచ్చని భాజపా నాయకురాలు ఖుష్బూ సుందర్ స్పష్టం చేశారు. తమిళనాడులోని థౌజెండ్​ లైట్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆమె.. ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేతో పోటీని తాను స్వాగతిస్తున్నట్లు 'ఈటీవీ భారత్​'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

'Have faith in my winning prospects', says BJP's Khushbu
గెలుస్తానన్న విశ్వాసం ఉంది: ఇంటింటి ప్రచారంలో ఖుష్బూ

తమిళనాడు ఎన్నికల కౌంట్​డౌన్ మొదలు కావటంతో భాజపా నాయకురాలు ఖుష్బూ.. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. థౌజెండ్​ లైట్స్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. నిరంతర కృషి, పట్టుదలతో బలమైన ప్రత్యర్థిని సైతం ఓడించవచ్చని 'ఈటీవీ భారత్​'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్బూ స్పష్టం చేశారు.

చెపాక్‌-ట్రిప్లికేన్‌ నియోజకవర్గానికి భాజపా తరఫునుంచి ఎన్నికల ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు ఖుష్బూ. అయితే.. ఇదే నియోజకవర్గం నుంచి కరుణానిధి మనవడు, డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి బరిలోకి దిగుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి

థౌజెండ్​ లైట్స్ నియోజకవర్గంలో నీరు, డ్రైనేజీ, వీధి లైట్ల సమస్య ఉందన్నారు ఖుష్బూ. తాను ఎన్నికల్లో విజయం సాధిస్తే కచ్చితంగా ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అన్నాడీఎంకే ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నానని తెలిపారు. తమిళనాడులో భాజపాకు ఆదరణ లభిస్తోందన్నారు.

ఇంటింటి ప్రచారం..

థౌజెండ్​ లైట్స్ నియోజకవర్గంలో ఎక్కువ మంది పేద ప్రజలు, అణగారిన వర్గాల వారు ఉన్నారు. 2016లో డీఎంకే అభ్యర్థి సెల్వన్​ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల ఆయన భాజపాలో చేరారు. ఖుష్బూ.. థౌజెండ్ లైట్స్​ నియోజకవర్గంలో ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తన ప్రసంగాలతో ఓటర్లను ఆకర్షించటమే కాక.. చిన్నారులతో సెల్ఫీలు దిగుతూ ఓటర్లను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న డీఎంకే అభ్యర్థి డా.ఎజిలాన్​ మాత్రం ప్రజలను ఆకర్షించలేకపోతున్నారు.

234 శాసనసభ నియోజకవర్గాలున్న తమిళనాడులో ఏప్రిల్​ 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చదవండి : ఓటింగ్​లో వెల్లివిరుస్తున్న మహిళా చేతన

సీమన్​ బలంతో 'తమిళపోరు'కు ఎన్​టీకే సై

డీఎంకే వారసత్వ, ప్రజాస్వామ్య వ్యతిరేక పార్టీ: భాజపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.