ETV Bharat / bharat

చైనా​ యాప్​ ద్వారా రూ.50 కోట్ల భారీ స్కామ్​

author img

By

Published : Aug 5, 2021, 12:07 PM IST

అహ్మదాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు.. రూ.50 కోట్లు భారీ మోసాన్ని బయటపెట్టారు. చైనీస్​ యాప్​ ద్వారా పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడిన ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి.. ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

Rs.50 crore scam
రూ.50 కోట్ల స్కామ్​

చైనా యాప్​ ద్వారా జరిగిన రూ.50 కోట్ల భారీ మోసాన్ని బయటపెట్టారు గుజరాత్​ అహ్మదాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు. యాప్​ ద్వారా పెట్టుబడుల పేరుతో రూ.6,000 నష్టపోయినట్లు ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో విచారణ జరిపిన అధికారులు.. మోసాలకు పాల్పడిన ముఠాను ఛేదించారు. చైనీస్​ యాప్​ ద్వారా పలు మార్గాల్లో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా 28,000 మంది నష్టపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఈ కేసుకు సంబంధించి గతంలో ఏడుగురుని అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. వారిలో యాసిన్​ ఖురేషి, దిలీప్ గోజియా, ధర్మేంద్ర సింగ్ రాథోడ్, రాహుల్ వధేర్, జయేశ్ గగియా తుషార్ ఘెటియా ఉన్నట్లు చెప్పారు. మహారాష్ట్రకు చెందిన జితేన్ షా పేరు కూడా ఉన్నట్లు తెలిపారు. మూడు నెలల్లో అతని కంపెనీ బ్యాంకు ఖాతాలో రూ.30 కోట్లు జమ అయిందని.. ఇందుకు ప్రతిగా కమీషన్​ కూడా చెల్లించినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో మరో నిందితుడి ఖాతాల్లో రూ.20 కోట్లు జమ అయినట్లు తెలిపారు. సోషల్ నెట్‌వర్క్ ద్వారా ప్రజలను సంప్రదిస్తున్న చైనాకు చెందిన ఓ భారతీయ వ్యక్తి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు పోలీసు విచారణలో తేలింది.

మోసం ఇలా..

సైబర్​ నేరగాళ్లు తొలుత.. టెలిగ్రామ్​, వాట్సాప్​లకు సందేశాల ద్వారా స్పామ్​ లింకులు పంపుతారు. పెట్టుబడి పెట్టేలా కస్టమర్లకు ఆకర్షీణియమైన సందేశాలు పంపుతారు. ఒకవేళ వినియోగదారులు పెట్టుబడి పెట్టినట్లయితే.. అప్లికేషన్ వెబ్‌సైట్ వాలెట్‌లో డబ్బులు చూపుతుంది. కానీ కస్టమర్ డబ్బు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నిస్తే, 'టెక్నికల్ ఎర్రర్' అని కనిపిస్తుంది. కస్టమర్ తన డబ్బును యాక్సెస్ చేయకుండా సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఖాతాదారుడు పదేపదే డబ్బు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నిస్తే.. యాప్​ పని చేయకుండా నిలిచిపోతుంది.

ఇదీ చూడండి: ఎర్రకోట సమీపంలో డ్రోన్ కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.