ETV Bharat / bharat

సన్నీ లియోనీ, నోరాతో ఛారిటీ షో!.. రూ.9 కోట్లకు టోకరా.. పోలీసులకు చిక్కి..

author img

By

Published : Jul 31, 2023, 10:33 AM IST

Updated : Jul 31, 2023, 11:52 AM IST

Fraud In The Name Of Sunny Leone Charity Show
Fraud In The Name Of Sunny Leone Charity Show

Sunny Leone Charity Show Scam : సన్నీ లియోనీ, నోరా ఫతేహీ లాంటి సినీ నటులతో చారిటీ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి సుమారు రూ.9 కోట్ల మేర మోసగించారు ముగ్గురు వ్యక్తులు. బాధితులు తేరుకుని కేసు నమోదు చేయగా.. రంగంలోకి దిగిన ​పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.​

Sunny Leone Charity Show Fraud : సన్నీ లియోనీ, నోరా ఫతేహీ లాంటి సినీ నటులతో చారిటీ షో నిర్వహిస్తామని దాదాపు రూ. 9 కోట్లు వరకు మోసం చేశారు ముగ్గురు వ్యక్తులు. పోలీసులకు దొరక్కుండా కొద్ది నెలలుగా పరారీలో ఉన్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల రంగంలోకి దిగిన ఉత్తర్​ప్రదేశ్​ స్పెషల్ టాస్క్ ఫోర్స్- ఎస్​టీఎఫ్​ పోలీసులు నిందితులను అరెస్టు చేసి.. ఈ కేసులో దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పుణెకు చెందిన విరాజ్​ త్రివేది అలియాస్​ వివేక్​, గుజరాత్​కు చెందిన సమీర్​ కుమార్​, జయంతి భాయ్​ దేరావాలిలు ముఠాగా ఏర్పడి.. పుణెలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. టైగర్ ష్రాఫ్, సన్నీ లియోనీ. నోరా ఫతేహి వంటి సినీ తారలు, గాయకులు గురు రంధవా, సచేత్ పరంపరా.. షోలో పాల్గొంటారని నమ్మించారు. అనంతరం షో టికెట్లు అమ్మి దాదాపు రూ. 9 కోట్ల వసూలు చేశారు. ఆ కార్యక్రమం రద్దు కావడం వల్ల పరారయ్యారు. దీంతో గోమతి నగర్ విస్తార్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు బాధితులు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Sunny Leone Fraud : కేసు విషయం తెలుసుకున్న నిందితులు పరారయ్యారు. దాదాపు మూడు నెలలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. దీంతో లఖ్​నవూ పోలీసులు రాష్ట్ర ఎస్​టీఎఫ్​ సహాయం కోరారు. అనంతరం రంగంలోకి దిగిన టాస్క్​ ఫోర్స్ పోలీసులు.. జులై 27న ప్రధాన నిందితుడు విరాజ్​ త్రివేది, బయంతి భాయ్​ దేవారాలియాను పుణెలో, సమీర్​ కుమార్​ జితేంద్ర భాయ్​ శర్మను అహ్మదాబాద్​లో అరెస్టు చేశారు. అయితే, వీరిపై ఇప్పటికే సుశాంత్ గోల్ఫో సిటీ పోలీస్​ స్టేషన్​లో ఇండియన్ పీనల్​ కోడ్- ఐపీసీ వివిధ సెక్షన్ల రెండు కేసులు నమోదయ్యాయి.

సన్నీ లియోనీ​ నిజంగానే మోసపోయింది!
Sunny Leone News In Telugu: ఇంతకుముందు సన్నీ లియోనీ నిజంగానే మోసపోయింది. ఆన్​లైన్​ కేటుగాళ్లు ఆమెను బురిడీ కొట్టించారు. ఆమె పాన్ కార్డు ఉపయోగించి, ఆన్​లైన్​లో లోన్ తీసుకున్నారు. ఈ విషయం ఆమె ట్వీట్ చేయడం వల్ల వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై ఆమె బ్యాంక్​ అధికారులను సంప్రదించగా, వారు సన్నీని మోసం చేసిన వ్యక్తులను గుర్తించి, సమస్యను పరిష్కరించారు. అనంతరం సన్నీ బ్యాంక్​ సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేసింది. పూర్తి కథనం చదవాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

  • Thank you @IVLSecurities @ibhomeloans @CIBIL_Official for swiftly fixing this & making sure it will NEVER happen again. I know you will take care of all the others who have issues to avoid this in the future. NO ONE WANTS TO DEAL WITH A BAD CIBIL !!! Im ref. to my previous post.

    — Sunny Leone (@SunnyLeone) February 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Last Updated :Jul 31, 2023, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.