ETV Bharat / bharat

కాంతులీనిన హరిద్వార్​.. 11 వేల దీపాలు వెలిగించి..

author img

By

Published : Nov 19, 2021, 8:25 AM IST

దేశవ్యాప్తంగా కార్తిక పౌర్ణమి వేడుకలు (Kartik purnima 2021) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని హర్​ కీ పౌడీ ఘాట్​లో ఒకేచోట 11 వేల దీపాలు వెలిగించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

ON THE OCCASION OF DEV DEEPAWALI 11 THOUSAND DIYAS WERE LIT ON HARKI PAURI
హర్​ కీ పౌడీలో దేవ్​ దీపావళి వేడుకలు

కార్తిక దీపాలు వెలిగిస్తున్న భక్తులు

కార్తిక పౌర్ణమి (Kartik purnima 2021) సందర్భంగా దేవ్​ దీపావళి వేడుకలు (Dev diwali 2021) పలు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని హర్​ కీ పౌడీ ఘాట్​కు (Har Ki Pauri Ghat, Haridwar) భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం రాత్రి ఏకంగా 11 వేల దీపాలు వెలిగించి.. ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు.

Dev Deepawali
హర్​ కీ పౌడీ ఘాట్​
Dev Deepawali
హర్​ కీ పౌడీ ఘాట్​కు వేలాదిగా తరలివచ్చిన భక్తులు

వేలాది దీపాలు ఒకేచోట వెలుగుతుండటం అద్భుతమని అన్నారు అఖాడా పరిషత్​ అధ్యక్షుడు రవీంద్ర పురీ. హర్​ కీ పౌడీలో జరుపుకున్నట్లే వేడుకలను అన్ని దేవాలయాల్లో నిర్వహించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది అన్ని పుణ్యక్షేత్రాల్లో అత్యద్భుతంగా వేడుకలు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

Dev Deepawali
దీపాలు వెలిగిస్తున్న భక్తులు

హర్​ కీ పౌడీకి రావడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దృశ్యాలు తమను అబ్బురపరిచాయని చెబుతున్నారు. బాణసంచా కాలుస్తూ సంబరంగా గడిపారు.

Dev Deepawali
బాణసంచా వెలుగుల్లో హర్​ కీ పౌడీ

ఈ రోజున దేవతలు దీపావళి (Dev diwali 2021) జరుపుకుంటారని ప్రజలు నమ్ముతారు. స్వర్గం నుంచి భూమికి చేరుకొని దీపం వెలిగిస్తారని విశ్వసిస్తారు.

ఇదీ చూడండి: karthika pournami 2021 : కార్తిక పౌర్ణమి నాడు దీపారాధన ఎందుకు చేయాలంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.