ETV Bharat / bharat

కొవిడ్​ తర్వాత కొత్త సమస్య- ఈసారి ఎముకలపై

author img

By

Published : Jul 6, 2021, 9:32 PM IST

కొవిడ్ నుంచి కోలుకున్నవారికి మరో పిడుగులాంటి వార్త! వైరస్ నుంచి బయటపడ్డ వారిలో ఎముక సంబంధిత వ్యాధిని గుర్తించారు వైద్యులు. ఈ వ్యాధి కారణంగా.. రక్త ప్రసరణ ఆగిపోయి, ఎముకలు, కీళ్లు పూర్తిగా పాడయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.

AVN COVID
కొవిడ్​ తర్వాత కొత్త సమస్య- ఈసారి ఎముకలపై

కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో అవాస్కులర్ నెక్రోసిస్(ఏవీఎన్) అనే ఎముక సంబంధిత వ్యాధిని గుర్తించారు. దిల్లీలోని బీఎల్​కే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని ముగ్గురు రోగులకు ఈ ఏవీఎన్ వ్యాధి ఉన్నట్లు తేలింది. ఈ ముగ్గురు బాధితుల్లో ఇద్దరు చికిత్స పొందుతుండగా.. మరొకరికి సర్జరీ నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

రక్త ప్రసరణ సరిగా లేక ఎముక కణజాలం పూర్తిగా నాశనమయ్యే వ్యాధినే ఏవీఎన్​గా వ్యవహరిస్తారు. దీని వల్ల ఎముకల్లో పగుళ్లు ఏర్పడతాయి. క్రమంగా ఎముకలు నాశనమవుతాయి. స్టెరాయిడ్స్ అధికంగా వాడటం వల్లే ఏవీఎన్ సమస్య తలెత్తుతోందని ఈ రోగులను పరిశీలిస్తున్న వైద్యులు పేర్కొన్నారు.

"కొవిడ్ అనంతర ప్రభావాల్లో ఏవీఎన్ ఒకటి. ఎముకలు, కీళ్లలో ఇది తలెత్తుతుంది. కరోనా చికిత్సలో భాగంగా అధిక స్టెరాయిడ్లు ఉపయోగించడమే ఈ వ్యాధికి ప్రధాన కారణం. స్టెరాయిడ్స్ వల్ల ఎముకలు గట్టిదనాన్ని కోల్పోతాయి. మృదులాస్థి పాడైపోతుంది. రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఈ వ్యాధి వెంటనే ప్రభావం చూపదు. లక్షణాలు బయటపడేందుకు మూడు నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది."

-డాక్టర్ ఈశ్వర్ బోరా, జాయింట్ రీప్లేస్​మెంట్ సర్జన్

కీళ్ల నొప్పులతో ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య ఈ మధ్య పెరిగిందని బోరా తెలిపారు. నడుము, భుజాల నొప్పి కూడా ఉంటోందని చెప్పారు. నడుం నొప్పి ఆరు వారాల్లో తగ్గిపోదని, ఎంఆర్ఐ చేయించాల్సి వస్తోందని అన్నారు. వ్యాధి తీవ్రత మూడో దశకు చేరితే సర్జరీ తప్పదని చెప్పారు. ఇందుకోసం రూ.3-4 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు.

ఏవీఎన్ కేసు తొలిసారి ముంబయిలో వెలుగుచూసింది. అనంతరం దిల్లీలో పలు కేసులు బయటపడ్డాయి. కొవిడ్ నుంచి కోలుకున్నవారికి ఫంగల్ ఇన్​ఫెక్షన్లు సహా పలు వ్యాధులు వస్తున్నట్లు ఇదివరకే నిర్ధరణ అయింది.

ఇదీ చదవండి: లాక్​డౌన్​లో వేలాది మందికి అవాంఛిత గర్భాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.