ETV Bharat / bharat

కొవిడ్ వ్యాక్సినేషన్ స్టేటస్ క్షణాల్లో తెలుసుకోండిలా..

author img

By

Published : Sep 10, 2021, 3:40 PM IST

కొవిడ్​ వ్యాక్సినేషన్​ స్టేటస్​ను సులభంగా తెలుసుకునేందుకు వీలుగా కొవిన్​ యాప్​లో సరికొత్త ఫీచర్​ అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం ద్వారా సదరు వ్యక్తికి వ్యాక్సినేషన్ పూర్తయిందా? లేదా? అని క్షణాల్లో తెలుసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది.

Co-WIN
కొవిన్​ యాప్

దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్​ కోసం వినియోగిస్తున్న 'కొవిన్​' పోర్టల్​లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది​. వ్యాక్సిన్ తీసుకున్నారా? లేదా? సులభంగా తెలుసుకునేందుకు 'నో యువర్​ కస్టమర్​/క్లయింట్​ వ్యాక్సినేషన్​ స్టేటస్​' పేరుతో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్​ఫేస్(ఏపీఐ)​ను తీసుకొచ్చినట్లు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

సులభంగా గుర్తించండిలా..

టీకా తీసుకున్నట్లు ఆధారం చూపేందుకు డిజిటల్ సర్టిఫికెట్​కు ఇప్పటికే కొవిన్​ యాప్​లో అందుబాటులో ఉంది. అయితే ప్రతిసారీ ఇలా వ్యాక్సిన్ ధ్రువపత్రాలను పరిశీలించకుండా.. సులభంగా వ్యాక్సినేషన్ స్టేటస్​ను తెలసుకునేందకు కొత్త ఏపీఐ ఉపయోగపడుతుందని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ విధానం వల్ల ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వ్యాక్సినేషన్ స్టేటస్​నూ.. అధికారులు సులభంగా గుర్తించవచ్చని తెలిపింది.

ఈ ఏపీఐ ఎలా ఉపయోగించాలి..?

ఈ ఏపీఐను ఉపయోగించాలంటే.. సదరు వ్యక్తి తన మొబైల్ నంబర్​ను ఎంటర్ చేయాలి. అప్పుడు ఆ నెంబర్​కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే..

మూడు రకాలుగా కొవిడ్ వ్యాక్సినేషన్ స్టేటస్ డిస్​ప్లే అవుతుంది.

  • వ్యక్తి వ్యాక్సిన్ తీసుకోలేదు
  • వ్యక్తి వ్యాక్సిన్ ఒక్క డోస్ తీసుకున్నారు.
  • వ్యక్తి పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నారు.

ఈ సమాచారాన్ని ఎవరికైనా షేర్​ చేసుకోవచ్చని మంత్రిత్వశాఖ వెల్లడించింది. వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం కలగదని భరోసా ఇచ్చింది. ఈ విధానాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ అని తేడాలేకుండా ఏ సంస్థ అయినా ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఏపీఐ ద్వారా కొవిడ్ వ్యాక్సినేషన్ సమాచారాన్ని అందించేందుకు ఓ వెబ్​పేజీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

దేశంలో వ్యాక్సినేషన్​ కార్యక్రమం ప్రారంభమైనప్పటినుంచి.. ఇప్పటివరకు 72 కోట్లకుపైగా కొవిడ్ టీకా డోసులను పంపిణీ చేశారు.

ఇదీ చదవండి: Covishield Vaccine: 66 కోట్ల డోసుల కొవిషీల్డ్‌ కోసం ఆర్డర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.