ETV Bharat / bharat

లంగ్స్​లో ఇరుక్కుపోయిన లవంగం- ఏడేళ్ల తర్వాత బయటకు!

author img

By

Published : Feb 4, 2022, 4:59 PM IST

Clove stuck in lungs: ఓ మహిళను.. బరువు తగ్గడం, విపరీత దగ్గు వంటి సమస్యలు వేధించాయి. వైద్యుల దగ్గరకు వెళ్లినా వాళ్లేం సరిగా చెప్పలేకపోయారు. క్యాన్సర్​ లక్షణాలు ఉన్నాయని అన్ని పరీక్షలు చేశారు. కానీ ఆ వ్యాధి కూడా సోకలేదు. ఏళ్ల పాటు శ్రమించి.. వైద్యులు అసలు విషయాన్ని కనిపెట్టారు. ఊపిరితిత్తుల్లో లవంగాన్ని గుర్తించి.. బయటకు తీశారు. ఆమె బతికింది.

Clove stuck in the lungs
Clove stuck in the lungs

Clove stuck in lungs: ఏడేళ్ల కిందట ఎప్పుడో తిన్న లవంగం అలాగే ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయింది. ఫలితంగా మధ్యప్రదేశ్ ఇందోర్​కు చెందిన 36 ఏళ్ల అనూషను ఎన్నో సమస్యలు వేధించాయి. బరువు తగ్గడం, తీవ్రమైన దగ్గు, ఉమ్మిలో రక్తం వంటివి ఇబ్బందిపెట్టాయి.

అనూష రెండేళ్లుగా విపరీతమైన దగ్గుతో బాధపడుతోంది. ఎన్ని పరీక్షలు చేసినా, మందులు వాడినా సమస్య తీరలేదు. దీనికి తోడు 3 నెలలుగా దగ్గుతో పాటు ఉమ్మి వేస్తుంటే రక్తం కూడా వచ్చేది. ఇది క్యాన్సరేనని ఆమె ఫ్యామిలీ డాక్టర్​ చెప్పారు. అనంతరం.. సమస్య ఇంకా తీవ్రమైంది.

ఇందోర్​ వైద్యులు ఆమెకు సీటీ స్కాన్​ సహా ఇతర పరీక్షలు చేసి క్యాన్సర్​ సంకేతాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఊపిరితిత్తుల్లో కణితిని గుర్తించారు. అప్పుడే అసలు నిజం బయటపడింది.

Clove stuck in the lungs
.

క్యాన్సర్​ కాదు.. లవంగం..

మహారాష్ట్ర నాగ్​పుర్​లో చికిత్స ప్రారంభించిన వైద్యులు.. అది క్యాన్సర్​ కాదని తేల్చారు. నోటి ద్వారా బైనాక్యులర్లను లోపలకు చేర్చిచూసినా.. ఏం గుర్తించలేకపోయారు. చివరకు మైక్రోస్కోపిక్​ పరీక్ష ద్వారా.. ఆమె ఊపిరితిత్తుల్లో లవంగం ఉందని తెలుసుకున్నారు. చికిత్స చేసి దానిని బయటకు తీశారు.

Clove stuck in the lungs
వైద్యులు బయటకు తీసిన లవంగం

ప్రస్తుతం కోలుకున్న అనూష.. ఎప్పుడో ఏడేళ్ల కిందట లవంగాలు తింటుంటే ఒకటి లోపల ఇరుక్కుపోయిందని చెప్పింది. వైద్యుల పరీక్షలతోనే ప్రాణాలతో బయటపడగలిగానని చెప్పుకొచ్చింది.

ఇవీ చూడండి: ఐదో క్లాస్ పాస్.. రూ.10వేల కోట్ల కంపెనీకి బాస్.. జల్లికట్టు కోసం...

పాఠశాలలోకి ప్రవేశించిన చిరుత.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.