ETV Bharat / bharat

ఒమిక్రాన్​ భయాలు- 10 రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలు

author img

By

Published : Dec 25, 2021, 1:00 PM IST

Central teams to states: ఒమిక్రాన్​తో పాటు కరోనా కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్​ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపనుంది. ఆయా రాష్ట్రాల్లో 3-5 రోజుల పాటు పర్యటించి కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్, ఆసుపత్రుల్లో పడకల లభ్యత వంటి వివిధ అంశాలను పర్యవేక్షించనున్నాయి.

Amid Omicron scare
ఒమిక్రాన్​

Central teams to states: దేశంలో ఓ వైపు ఒమిక్రాన్​ భయాలు, మరోవైపు కొత్త కేసుల పెరుగుదల నేపథ్యంలో కట్టడి చర్యలకు ఉపక్రమించింది కేంద్రం. వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉన్న 10 రాష్ట్రాల్లో కేంద్ర అత్యున్నత స్థాయి బృందాలను మోహరించనున్నట్లు శనివారం తెలిపింది కేంద్రం వైద్య, ఆరోగ్య శాఖ.

" ఒమిక్రాన్​ కేసులు, కొవిడ్​-19 కేసుల్లో భారీగా పెరుగదల లేదా వ్యాక్సినేషన్​ నెమ్మదిగా నడుస్తోన్న గుర్తించిన 10 రాష్ట్రాలకు కేంద్ర ప్రత్యేక బృందాలను పంపాలని నిర్ణయించాం. ఆ రాష్ట్రాలు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, బంగాల్​, మిజోరాం, కర్ణాటక, బిహార్​, ఉత్తర్​ప్రదేశ్​, ఝార్ఖండ్​, పంజాబ్​లు. ప్రత్యేక బృందాలు ఆయా రాష్ట్రాల్లో మూడు నుంచి ఐదు రోజుల పాటు పర్యటిస్తాయి. రాష్ట్ర ఆరోగ్య అధికారులతో కలిసి పనిచేస్తాయి. "

- కేంద్ర ఆరోగ్య శాఖ.

ప్రత్యేక బృందాలు ముఖ్యంగా.. కాంటాక్ట్​ ట్రేసింగ్​, నిఘా, కంటైన్​మెంట్​ కార్యక్రమాలు, కొవిడ్​-19 పరీక్షలు, అవసరమైన నమూనాలను జినోమ్​ సీక్వెన్సింగ్​ కోసం ఇన్సాకాగ్​కు పంపించటం వంటి అంశాలను పరిశీలించనున్నాయని కేంద్రం వెల్లడించింది. అలాగే.. కొవిడ్​ జాగ్రత్తలు అమలు చేయటం, ఆసుపత్రుల్లో పడకల లభ్యత, అంబులెన్స్​లు, వెంటిలేటర్లు, మెడికల్​ ఆక్సిజన్​తో పాటు రవాణా, వ్యాక్సినేషన్​ పురోగతికి కూడా ఈ బృందాలు బాధ్యత వహిస్తాయి. 'రాష్ట్రస్థాయి కేంద్ర బృందాలు పరిస్థితులను అంచనా వేయటం, అవసరమైన చర్యలను సూచించటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ప్రజారోగ్య కార్యక్రమాలపై ప్రతి రోజు సాయంత్రం 7 గంటలకు నివేదిక సమర్పిస్తాయి.' అని ఆరోగ్య శాఖ పేర్కొంది.

దేశంలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 7,189 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 415కు చేరింది.

ఇవీ చూడండి: Covid Cases in India: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

'భారత్​లో థర్డ్​ వేవ్​- ఫిబ్రవరిలో గరిష్ఠానికి కేసులు!'

మహారాష్ట్రలో మళ్లీ కఠిన ఆంక్షలు- కొత్త మార్గదర్శకాలు విడుదల

కరోనా విజృంభణపై కేంద్రం హెచ్చరిక- అనేక రాష్ట్రాల్లో నైట్​ కర్ఫ్యూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.