ETV Bharat / bharat

మహారాష్ట్రలో మళ్లీ కఠిన ఆంక్షలు- కొత్త మార్గదర్శకాలు విడుదల

author img

By

Published : Dec 24, 2021, 9:08 PM IST

Updated : Dec 24, 2021, 9:38 PM IST

FLASH : Night curfew in Maharashtra from midnight today

Restrictions in Maharashtra
మహారాష్ట్రలో మళ్లీ కఠిన ఆంక్షలు

21:04 December 24

మహారాష్ట్రలో మళ్లీ కఠిన ఆంక్షలు- కొత్త మార్గదర్శకాలు విడుదల

Maharashtra Restrictions: మహారాష్ట్రలో ఒమిక్రాన్​ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కఠిన ఆంక్షలు విధిస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. క్రిస్మస్​ సహా నూతన సంవత్సరం నేపథ్యంలో వైరస్​ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని చెప్పారు.

కొత్త ఆంక్షలు ఇలా..

  • రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి గుమిగూడటం నిషేధం.
  • ఇండోర్ ప్రాంతాల్లో జరిగే వివాహాలకు 100 మందికి మాత్రమే అనుమతి. బహిరంగ ప్రదేశాల్లో జరిగే వేడుకల్లో గరిష్ఠంగా 250 మందికి మాత్రమే అనుమతి.
  • జిమ్​లు, స్పా, హోటళ్లు, థియేటర్లు, సినిమా హాళ్లు 50 శాతం సామర్థ్యంతో నిర్వహించేందుకు అనుమతి.
  • ఇతర సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యక్రమాల్లోనూ 100 మందికి మించి హాజరవకూడదు. బహిరంగ ప్రదేశాల్లో జరిగితే.. 250 మంది లేదా స్థల సామర్థ్యంలో 25 శాతంలో ఏది తక్కువైతే దానికి కట్టుబడి ఉండాలి.

Covid Cases in Maharashtra: రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 1,410 కరోనా, 20 ఒమిక్రాన్​ కేసులు వెలుగు చూశాయి. గురువారంతో పోలిస్తే రోజువారి కేసుల సంఖ్య 200పెరిగింది.

ఇదీ చూడండి:

ప్రజలకు కేంద్రం హెచ్చరిక- అనేక రాష్ట్రాల్లో నైట్​ కర్ఫ్యూ

Last Updated : Dec 24, 2021, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.