ETV Bharat / bharat

'భాజపా గెలిస్తే స్టూడెంట్స్​కు స్కూటీలు, ల్యాప్​టాప్​లు ఫ్రీ!'

author img

By

Published : Feb 17, 2022, 7:07 PM IST

BJP manipur manifesto: మణిపుర్‌ ఎన్నికలకు సంబంధించి భాజపా మేనిఫెస్టోను గురువారం విడుదల చేసింది. తాము తిరిగి అధికారంలోకి వస్తే ఉత్తమ ప్రతిభ కనబర్చిన కళాశాల విద్యార్థినులకు ద్విచక్ర వాహనాలు అందజేస్తామని ప్రకటించింది. వృద్ధాప్య పింఛన్‌ను 5 రెట్లు పెంచుతామని హామీ ఇచ్చింది.

BJP manipur manifesto
భాజపా మ్యానిఫెస్టో

BJP manipur manifesto: మణిపుర్‌లో తాము తిరిగి అధికారంలోకి వస్తే ప్రతిభ కనబర్చిన కళాశాల విద్యార్థినులకు ద్విచక్ర వాహనాలు ఉచితంగా అందజేస్తామని భాజపా హామీ ఇచ్చింది. వృద్ధుల పింఛన్​ను రెండు వందల నుంచి వెయ్యి రూపాయిలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ మేరకు మణిపుర్‌ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. స్టార్టప్​ల కోసం ఏకంగా వంద కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా మణిపుర్​ రాజధాని ఇంఫాల్‌లో ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

ముఖ్యమంత్రి ఎన్‌ బీరేన్‌ సింగ్‌ నాయకత్వంలో రాష్ట్రం గత ఐదేళ్లుగా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కొనియాడారు నడ్డా. డ్రగ్స్‌ దందాను అరికట్టడం సహా చట్టబద్ధమైన పాలనతో సుస్థిరత సాధించామని అన్నారు.

భాజపా మణిపుర్​ ఎన్నికల మేనిఫెస్టోలోని కీలకాంశాలు..

  • ప్రతిభ కనబరినచిన విద్యార్థినులకు ఉచితంగా ద్విచక్ర వాహనాలు.
  • మంచి మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.
  • స్టార్టప్​లకు రూ. 100 కోట్లతో ప్రత్యేక నిధి.
  • వృద్ధాప్య పింఛను రూ. 200 నుంచి రూ. 1000కి పెంపు.
  • ఆర్థికంగా వెనకబడిన విద్యార్థినులకు రూ. 25 వేల ఆర్థిక సాయం.
  • ఉచితంగా ఏడాదికి రెండు ఎల్​పీజీ సిలిండర్లు.
  • పీజీ, గ్రాడ్యుయేషన్​, సాంకేతిక విద్య అభ్యసిస్తున్న చిన్న, సన్నకారు రైతుల పిల్లలకు స్కాలర్​షిప్​లు.
  • పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి నుంచి ఏడాదికి అందించే ఆర్థిక సాయం రూ. 6 వేల నుంచి రూ. 8 వేలకు పెంపు.
  • యువత నైపుణ్యాభివృద్ధికి స్కిల్​ డెవలప్​మెంట్​ యూనివర్శిటీ ఏర్పాటు.
  • ప్రజల వైద్యం కోసం ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్​) ఏర్పాటు.
  • ఔత్సాహిక యువతకు రూ. 25 లక్షల వరకు జీరో వడ్డీ రుణాలు.
  • పర్యటకాన్ని ప్రోత్సహించేలా రాయితీలు.
  • రాష్ట్ర పర్యటకానికి ఫో-ఫో ట్రైన్​ల పెంపు
  • గోటూ విలేజ్​, గోటూ హిల్స్​ పేరుతో ప్రజల వద్దకు పాలన.

ఇదీ చూడండి: 'మీ తప్పులు అంగీకరించకుండా.. నెహ్రూను బాధ్యుల్ని చేస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.