ETV Bharat / bharat

'దేశ సాంస్కృతిక వారసత్వానికి ఓనం చిహ్నం'

author img

By

Published : Aug 31, 2020, 11:46 AM IST

PM extends greetings on Onam
ఓనం పండుగ శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని, రాష్ట్రపతి

ఓనం పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ పండుగ సామరస్యానికి ప్రతీక అని మోదీ ట్వీట్ చేశారు. గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ఓనం చిహ్నమని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ అన్నారు.

దేశ ప్రజలందరికీ ఓనం పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇది సామరస్యానికి ప్రతీకగా జరుపుకొనే ప్రత్యేక పండుగ అని ట్వీట్​ చేశారు. ఆదివారం జరిగిన మన్​కీబాత్ కార్యక్రమంలో ఓనం గురించి ప్రస్తావించినట్లు గుర్తు చేస్తూ వీడియే షేర్ చేశారు.

  • Greetings on Onam. This is a unique festival, which celebrates harmony. It is also an occasion to express gratitude to our hardworking farmers. May everyone be blessed with joy and best health. pic.twitter.com/4pjpGRKk6Q

    — Narendra Modi (@narendramodi) August 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ప్రజలకు ఓనం శుభాకాంక్షలు. సామరస్యానికి ప్రతీకగా జరుపుకొనే ప్రత్యేక పండుగ ఇది. నిరంతరం శ్రమించే రైతులకు కృతజ్ఞతలు తెలిపే సందర్భమిది. అందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఓనం పండుగ గొప్ప సాంస్కృతిక వారసత్వానికి చిహ్నమని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. కొత్త పంట రాకతో ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే సందర్భమిదన్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.

  • Onam greetings to everyone! The festival of Onam is a symbol of our rich cultural heritage and an expression of our gratitude to Mother Nature at the arrival of new crop. Let us take care of people from the weaker sections of the society and follow guidelines to contain COVID-19.

    — President of India (@rashtrapatibhvn) August 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ప్రజలకు ఓనం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప రాజు మహాబలి స్వాయత్తం చేసుకున్న నిజాయతీ, సమగ్రత, కరుణ, నిస్వార్థం, త్యాగం విలువలను ఓనం సందర్భంగా గుర్తు చేసుకోవాలని ట్వీట్​ చేశారు.

  • On this #Onam, let us remind ourselves of the values of honesty, integrity, compassion, selflessness & sacrifice which the great king Mahabali espoused.

    May this joyous festival bring peace, prosperity and happiness to everyone. pic.twitter.com/g1QGziRyko

    — Vice President of India (@VPSecretariat) August 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఓనం పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, సామరస్యం, ఆరోగ్యం, శ్రేయస్సును తీసుకురావాలని హోంమంత్రి అమిత్​ షా ట్వీట్​ చేశారు.

  • Warm greetings on the auspicious occasion of Onam. May this festival bring joy, harmony, good health and prosperity in everyone’s lives.

    Happy Onam! pic.twitter.com/8oOSoScZzE

    — Amit Shah (@AmitShah) August 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: ఆన్​లైన్ ఓనం: వేడుకల్లో అబ్పురపరిచిన చిన్నారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.