ETV Bharat / bharat

ఆన్​లైన్ ఓనం: వేడుకల్లో అబ్బురపరిచిన చిన్నారులు

author img

By

Published : Aug 31, 2020, 10:46 AM IST

Updated : Aug 31, 2020, 9:22 PM IST

కేరళవాసులు ప్రతిఏటా ఎంతో ఘనంగా జరుపుకొనే ఓనం పండుగను ఈ సారి వినూత్నంగా చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో వర్చువల్​గా వేడుకలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థుల కళానైపుణ్యం చూసి తల్లిదండ్రులు, టీచర్లు పరవశించిపోయారు. ఓనం వేడుకలు తొలిసారి నిరాడంబరంగా జరుగుతున్నాయి.

Cor'Onam' times in Kerala;  Not just classes, even Onam goes online with covid
ఆన్​లైన్ ఓనం వేడుకల్లో అబ్పుపరిచిన చిన్నారులు

ప్రతిఏటా కనులపండువగా జరిగే ఓనం ఈసారి కరోనా కారణంగా నిరాడంబరంగా సాగింది. అయితే మలయాళీల ఉత్సాహంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రత్యేకించి చిన్నారులు, కళాశాల విద్యార్థులు ఈసారి వినూత్నంగా వర్చువల్​గా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇప్పటికే ఆన్​లైన్​ తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో ఇలా వేడుక జరుపుకోవడం వారికి సులభమయ్యింది.

ఆన్​లైన్ ఓనం

ఆన్​లైన్​ ఓనం ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులు తమ కళాప్రదర్శనతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అబ్బురపరిచారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. వంటల పోటీలు నిర్వహించారు. నృత్యప్రదర్శనతో అలరించారు. వారి డాన్స్​ వీడియోలను స్వయంగా ఎడిట్​ చేసుకుని గ్రూప్​ వీడియోలుగా మార్చి సమర్పించారు. విద్యార్థుల టాలెంట్​ చూసి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మంత్రముగ్దులయ్యారు. ఓనం పండుగను వర్చువల్​గా జరుపుకోవడం ద్వారా సరికొత్త అనుభూతిని పొందినట్లు చెప్పారు.

ప్రదర్శనలో భాగంగా అసుర రాజులు మహాబలి, వామనన్​ వేషధారణలో మైమరిపించారు చిన్నారులు. కేరళ సంప్రదాయ నృత్యం తిరువత్తిరక్కల్​తో అలరించారు. ఓనం జానపద గీతాలతో మెప్పించారు. వేడుకల్లో పాల్గొన్న ప్రతిఒక్క విద్యార్థి రంగోలి వేసి, పాయసం తయారు చేశారు.

భవిష్యత్తులో కరోనా భయాలు లేకుండా అందరూ కలిసి ఓనం వేడుక చేసుకుంటామనే ఆశతో ఆన్​లైన్​ ఉత్సవాలు ముగించారు. కరోనా పరిస్థితుల మధ్య జరుపుకొంటున్నందుకు ఈ వేడుకలకు 'cor-Onam' అని పేరు పెట్టారు.

ఇదీ చూడండి: గర్భగుడిలో శివలింగాన్ని ముంచెత్తిన వరద

Last Updated :Aug 31, 2020, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.