ETV Bharat / bharat

సరిహద్దు వివాదంపై భారత్​-చైనా సుదీర్ఘ చర్చలు

author img

By

Published : Jul 1, 2020, 4:50 AM IST

Updated : Jul 1, 2020, 7:00 AM IST

తూర్పు లద్దాఖ్​ సరిహద్దు వివాదంపై భారత్-చైనా మధ్య మూడో విడత చర్చలు 10 గంటల పాటు ఏకధాటిగా సాగాయి. కమాండర్ స్థాయి అధికారుల మధ్య జరిగిన ఈ భేటీలో.. తూర్పు లద్దాఖ్​లో చైనా కొత్తగా తమవని పేర్కొంటున్న ప్రాంతాల పట్ల భారత్​ అభ్యంతరం వ్యక్తం చేసింది. గల్వాన్​ లోయ సహా సరిహద్దుల వెంట తమ బలగాలను వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది.

India, China held third round of Lt Gen-level talks for 10 hours
లద్దాఖ్​లో బలగాలు వెనక్కి తీసుకోవాలని చైనాకు భారత్ స్పష్టం

సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్-చైనా మధ్య మూడో విడత చర్చలు జరిగాయి. కార్ప్​ కమాండర్​ స్థాయి అధికారుల మధ్య మంగళవారం 10 గంటల పాటు ఏకధాటిగా సాగిన భేటీలో.. లద్దాఖ్​లోని పలు ప్రాంతాల్లో బలగాలను వెనక్కి తీసుకునే మార్గదర్శకాలకు తుది రూపు ఇవ్వడంపై చర్చించారు. ఈ సందర్భంగా తమ ఆందోళనను చైనా ముందుంచిన భారత్.. తూర్పు లద్దాఖ్​లో చైనా కొత్తగా తమవిగా పేర్కొంటున్న ప్రాంతాల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. తూర్పు లద్దాఖ్​లో యథాతథ స్ధితిని పునరుద్ధరించాలని, గల్వాన్​ లోయ సహా సరిహద్దుల వెంట తమ బలగాలను వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది. సరిహద్దు అంశాల నిర్వహణపై గతంలో కుదిరిన ఒప్పందాలను చైనా గట్టిగా పాటించాలని సూచించింది.

వాస్తవాధీన రేఖ వద్ద భారత్​ వైపు ఉన్న చుషుల్ సెక్టార్​లో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ చర్చలు జరిగాయి. భారత్​ తరఫున 14వ కార్ప్​ కమాండర్​ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్​, చైనా తరఫున టిబెట్ సైనిక జిల్లా మేజర్ లీ లిన్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: వారందరికీ మోదీ అండ- వీరందరికీ హెచ్చరిక

Last Updated :Jul 1, 2020, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.