ETV Bharat / bharat

జేఈఈ, నీట్​పై మే 5న కేంద్రం కీలక ప్రకటన

author img

By

Published : May 3, 2020, 6:46 PM IST

ఇంజినీరింగ్​, మెడికల్​ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ, నీట్​ పరీక్షల నూతన తేదీలపై మే 5న ప్రకటన చేయనున్నట్లు కేంద్ర మానవ వనరులు, అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ అమల్లో ఉన్నందున పరీక్షలను వాయిదా వేసింది హెచ్​ఆర్​డీ.

Fresh dates for JEE, NEET to be announced on May 5: HRD ministry
ఆ ప్రవేశ పరీక్షలపై మే 5న కేంద్రం కీలక ప్రకటన

కరోనా వ్యాప్తి దృష్ట్యా అమలు చేసిన లాక్​డౌన్​ కారణంగా వాయిదాపడ్డ జేఈఈ, నీట్​ పరీక్షలకు సంబంధించి మే 5న ప్రకటన చేయనున్నట్లు వెల్లడించింది కేంద్ర మానవ వనరులు, అభివృద్ధి మంత్రిత్వ శాఖ(హెచ్​ఆర్​డీ). కేంద్రమంత్రి అదే రోజున విద్యార్థులతో ఆన్​లైన్​లో సంభాషించనున్నట్లు తెలిపింది. కొంతకాలంగా ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశార్హత పరీక్షల కోసం చూస్తున్న విద్యార్థులకు హెచ్​ఆర్​డీ ప్రకటనతో కాస్త ఊరట లభించింది.

''కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​.. పోటీ పరీక్షల నూతన తేదీలను మే 5న ప్రకటిస్తారు. ఈ ప్రకటనతో విద్యార్థుల్లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోనుంది. అదే రోజున కేంద్ర మంత్రి ఆన్​లైన్​ ద్వారా విద్యార్థులతో సంభాషిస్తారు.''

- కేంద్ర మానవ వనరులు, అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ప్రముఖ ఇంజినీరింగ్​ కళాశాలల్లో ప్రవేశానికి జేఈఈ-మెయిన్స్​, వైద్య కళాశాలల్లో చేరేందుకు నీట్​ పరీక్షలను నిర్వహిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.