ETV Bharat / bharat

అంబులెన్స్​లో 6 కిలోమీటర్లకు రూ.9,200 ఛార్జీ..?

author img

By

Published : Jul 26, 2020, 3:04 PM IST

Ambulance driver 'demands Rs 9,200' from COVID-19 patients for 6-km journey to hospital
6 కిలోమీటర్లకు రూ.9,200 డిమాండ్​ చేసిన వాహనదారుడు

కొవిడ్​ నేపథ్యంలో దేశంలో పరిస్థితులు అంతకంతకూ దిగజారిపోతున్నాయి. వైరస్​ వ్యాప్తి భయంతో వాహనదారులకు డిమాండ్​ భారీగా పెరిగిపోతోంది. ఇదే అదునుగా భావించిన ఓ అంబులెన్స్​ డ్రైవర్​ వైరస్​ సోకిన ఇద్దరు వ్యక్తులను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఏకంగా.. రూ. 9 వేలకు పైనే డిమాండ్​ చేశాడు. చివరికి ఆసుపత్రి వైద్యుల జోక్యంతో దిగొచ్చిన డ్రైవర్​ రూ.2 వేలకు ఓకే అన్నాడు.

బంగాల్​లోని కోల్​కత్తాలో కేవలం 6 కిలోమీటర్ల ప్రయాణం కోసం ఏకంగా రూ.9,200 డిమాండ్​ చేశాడు ఓ అంబులెన్స్​ డ్రైవర్​. అంత సొమ్ము తాము చెల్లించలేమని బాధితులు వాపోగా.. తన వాహనం నుంచి దిగిపొమ్మన్నాడు ఆ వాహనదారుడు. చివరకు అక్కడి వైద్యులు జోక్యం చేసుకొని సర్దిచెప్పగా.. రూ. 2,000లకు తగ్గాడు.

అసలేం జరిగిందంటే.?

కోల్​కతాలోని ఓ ప్రాంతంలో తొమ్మిది నెలలు, తొమ్మిదన్నరేళ్ల వయసున్న ఇద్దరు సోదరులు అనారోగ్యంతో ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఛైల్డ్​ హెల్త్​(ఐసీహెచ్​)లో చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలో కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారివురికీ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వారిని అంబులెన్స్​ ద్వారా ప్రభుత్వాస్పత్రిలో తరలించే ప్రయత్నం చేశాడా తండ్రి.

ఐసీహెచ్​ నుంచి స్థానిక మెడికల్​ కాలేజీ ఆస్పత్రికి వెళ్లేందుకు అంబులెన్స్​ డ్రైవర్.. రూ.9,200 ​భారీ మొత్తాన్ని ఇవ్వాలని కోరినట్లు ఆ తండ్రి చెప్పాడు. అంత సొమ్ము తాను ఇచ్చుకోలేనని వేడుకొన్నా.. డ్రైవర్​ పట్టించుకోలేదన్నాడు.

ఇంతలో.. అంబులెన్స్​లో ఉన్న తన చిన్న కూమారుడికి ఆక్సిజన్​ తీసేసి, తన భార్యను బలవంతగా వాహనం నుంచి దింపారని కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే... అక్కడి వైద్యులు కలగజేసుకొని తనకు మద్దతు పలికారని బాధితుడు తెలిపారు. ఆ వైద్యుల కారణంగానే తన కుమారులకు ఇప్పుడు కేఎంసీహెచ్​లో మెరుగైన చికిత్స అందుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: కరోనాపై పోరు: ఒక్కరోజే 4 లక్షలకు పైగా టెస్టులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.