ETV Bharat / bharat

కరోనాపై పోరు: ఒక్కరోజే 4 లక్షలకు పైగా టెస్టులు

author img

By

Published : Jul 26, 2020, 1:04 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టెస్టులను గణనీయంగా పెంచుతోంది ప్రభుత్వం. ఇందుకోసం దేశవ్యాప్తంగా మరిన్ని కొవిడ్​ ల్యాబ్​లకు అనుమతులు ఇచ్చింది. వీటి ద్వారా ఇప్పటివరకు సుమారు కోటి 63 లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్​ స్పష్టం చేసింది.

Covid test in India crosses one crore sixty lakhs
ఒక్కరోజే 4లక్షలకుపైగా టెస్టులు

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరుగుతున్న సమయంలో కొవిడ్​ నిర్ధరణ పరీక్షలను పెంచింది కేంద్రం. ఫలితంగా రోజూ సుమారు 4 లక్షల కరోనా పరీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు అధికారులు. శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 4,42,263 శాంపిళ్లకు కరోనా నిర్ధరణ పరీక్షలు చేసినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది.

ఇప్పటివరకు 1,62,91,331 శాంపిళ్లకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం.. ప్రతి పదిలక్షల జనాభాకు కనీసం 140 పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే దేశంలో దాదాపు 19 రాష్ట్రాలు 140(పది లక్షల జనాభాకు) కన్నా ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తమిళనాడులో నిన్న ఒక్కరోజే 60 వేల పరీక్షలు చేశారు.

పెరిగిన ప్రయోగశాలలు..

ప్రస్తుతం దేశంలో కరోనా టెస్టులు నిర్వహించేందుకు 1307 లేబొరేటరీలకు ఐసీఎంఆర్‌ అనుమతినిచ్చింది. వీటిలో 905 ప్రభుత్వ, 402 ప్రైవేటు ల్యాబ్‌లు ఉన్నాయి. మొత్తం ల్యాబ్‌లలో దాదాపు 665 కేంద్రాల్లో ఆర్‌టీ-పీసీఆర్‌ ద్వారానే పరీక్షలు నిర్వహిస్తున్నారు. జనవరి 23 నాటికి దేశంలో ఒకే ఒక్క లేబొరేటరీ అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం వీటి సంఖ్య 1307కు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

భారత్​ టాప్​-2

ప్రపంచంలో అత్యధిక కొవిడ్‌ టెస్టులను అమెరికా నిర్వహిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 5 కోట్ల 30లక్షల మందికి కరోనా టెస్టులు పూర్తి చేసినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. అమెరికా తర్వాత భారత్‌ ఎక్కువ టెస్టులు నిర్వహిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.

భారత్‌లో కొవిడ్‌ ల్యాబ్‌ల సంఖ్య పెరిగిందిలా..

తేదీల్యాబ్​ల సంఖ్య
2020 జనవరి 2301
2020 మార్చి 23160
2020 జులై 251307

ఇదీ చదవండి: క్లినికల్​ ట్రయల్స్​లో వేగం పెంచిన 'సీరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.