ETV Bharat / bharat

అక్కాచెల్లెళ్ల ఘనత- ఒకేసారి ముగ్గురికి ప్రభుత్వ ఉద్యోగం

author img

By

Published : Jul 15, 2021, 4:55 PM IST

ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి స్టేట్​ అడ్మినిస్ట్రేటివ్​ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులై.. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అంతకుముందు వీరి మరో ఇద్దరు తోబుట్టువులు కూడా అదే హోదాలో ఉన్నారు. దాంతో ఇప్పుడు ఒకే ఇంటి నుంచి ఐదుగురు అమ్మాయిలు.. ప్రభుత్వ అధికారులుగా మారారు.

3 sisters as ras officers
ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగం

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చాలామంది కలలు కంటారు. ఎంతో శ్రమిస్తే తప్ప.. ఏ కొద్ది మందికో తప్ప అందరికీ ఆ కల నెరవేరదు. మరి అలాంటిది ఒకే ఇంటి నుంచి ఐదుగురు అమ్మాయిలు.. ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు కదా? రాజస్థాన్​ హనుమాన్​గఢ్​కు చెందిన ఐదుగురు తోబుట్టువులు మాత్రం ఈ అరుదైన ఘనత సాధించారు.

రాజస్థాన్​ స్టేట్​ అడ్మనిస్ట్రేటివ్ సర్వీస్​(ఆర్​ఏఎస్​) పరీక్షలో అన్షు, రీతు, సుమన్​ అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి ఉత్తీర్ణులయ్యారు. అయితే.. వారి మరో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కుడా ఇప్పటికే ఆర్ఏఎస్​ అధికారులుగా ఉండటం విశేషం. దాంతో ఇప్పుడు ఒకే ఇంటి నుంచి ఐదుగురూ ఆర్​ఏఎస్​ అధికారులుగా మారారు. ఈ విషయాన్ని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్​ ప్రవీణ్​ కాసవాన్..​ ట్విట్టర్​లో షేర్​ చేశారు. ఈ ముగ్గురు అక్కాచెలెళ్లకు అభినందిస్తూ వారి ఫొటోను పోస్ట్​ చేశారు.

  • Such a good news. Anshu, Reetu and Suman are three sisters from Hanumangarh, Rajasthan. Today all three got selected in RAS together. Making father & family proud. pic.twitter.com/n9XldKizy9

    — Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"రాజస్థాన్​ హనుమాన్​గఢ్​కు చెందిన అన్షు, రీతు, సమన్​.. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆర్ఏఎస్​ అధికారులుగా ఎంపికయ్యారు. ఇదో మంచి వార్త. వీరు తమ తండ్రిని, కుటుంబాన్ని గర్వపడేలా చేశారు. వీరి మరో ఇద్దరు అక్కాచెల్లెళ్లు రోమా, మంజు ఇప్పటికే ఆర్ఏఎస్​ అధికారులుగా ఉన్నారు. సహదేవ్​ సహారన్​ అనే రైతు బిడ్డలైన ఈ ఐదుగురూ ఇప్పడు ఆర్​ఏఎస్​ అధికారులే."

- ప్రవీణ్​ కాసవాన్, ఐఎఫ్​ఎస్​ అధికారి

ప్రవీణ్ కాసవాన్​​ చేసిన ట్వీట్​కు 6 వేలకుపైగా లైకులు వచ్చాయి. ఈ తోబుట్టువులను నెటిజన్లు తమ కామెంట్లలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఆర్​ఏఎస్​ 2018 ఫలితాలను రాజస్థాన్​ పబ్లిక్ సర్వీస్ కమిషన్​(ఆర్​పీఎస్​సీ) మంగళవారం విడుదల చేసింది. ఝంఝునుకు చెందిన ముక్తా రావ్​ ఈ పరీక్షలో టాపర్​గా నిలవగా... టోంక్​కు చెందిన మన్మోహన శర్మ, జైపుర్​కు చెందిన శివాక్షి ఖందల్​.. రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

ఆర్ఏఎస్​ టాపర్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​.. ట్విట్టర్​లో అభినందించారు. రాష్ట్రానికి సేవ చేసేందుకు వారికి దొరికిన గొప్ప అవకాశం ఇది అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: సెలూన్​లోకి అనుకోని అతిథి- గంటసేపు మేకప్​!

ఇదీ చూడండి: ఐబీపీఎస్​ క్లర్క్​ పోస్టుల భర్తీకి బ్రేక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.