ETV Bharat / bharat

మరో వెయ్యికిపైగా కరోనా కేసులు- మరణాలు మాత్రం..

author img

By

Published : Apr 8, 2022, 9:48 AM IST

covid cases in india
కరోనా కేసులు

Covid Cases in India: దేశంలో కొత్తగా 1,109‬ కరోనా కేసులు నమోదయ్యాయి. 43 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 1,222 మంది కోలుకున్నారు. మరోవైపు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన టీకాల సంఖ్య 185.38 కోట్లకు చేరింది.

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 1,109‬ కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 43 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 12 వేల దిగువకు పడిపోయింది. 1,213 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.76 శాతంగా నమోదైంది.

• యాక్టివ్ కేసులు: 11,492
• మరణాలు: 5,21,573
• మొత్తం కేసులు: 4,30,33,067
• రికవరీలు: 4,24,98,789
India vaccination: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 16,80,118 మందికి గురువారం టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 185.38 కోట్లకు చేరింది. 12-14 ఏళ్ల మధ్య వారికి పంపిణీ చేసిన డోసుల సంఖ్య 2.11 కోట్లుగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. గురువారం 4,53,582 కరోనా టెస్టులు నిర్వహించారు.

World Covid cases: ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 11,41,677 కేసులు వెలుగులోకి వచ్చాయి. 3,512 మంది ప్రాణాలు కోల్పోయారు. జర్మనీ, దక్షిణ కొరియాలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటోంది. దక్షిణ కొరియాలో కొత్తగా 2.24 లక్షల కేసులు నమోదుకాగా.. 348 మంది వైరస్​కు బలయ్యారు. మరోవైపు జర్మనీలో కూడా రెండు లక్షలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. 289 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా, వియత్నాం, జపాన్ దేశాల్లో వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగా ఉంది.

ఇదీ చూడండి : రెండు డోసుల కొవాగ్జిన్​తో.. కొవిడ్​ నుంచి అత్యంత రక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.