సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా స్వాతి నక్షత్ర హోమం, తరలి వచ్చిన భక్తులు
Simhachalam Appanna Temple Swathi Nakshatra Homam : విశాఖలోని సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వాతి నక్షత్ర హోమం వైభవంగా నిర్వహించారు. స్వామివారికి జరిగే ఆర్జిత సేవలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. విశేష ఆదరణ ఉన్న ఈ స్వాతి నక్షత్ర హోమం నెలలో ఒకరోజు మాత్రమే జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి యాగశాలలో నక్షత్ర హోమం ఘనంగా నిర్వహించారు. ఆర్జిత సేవలో పాల్గొనాలంటే ముందుగా దేవస్థానం అధికారులను సంప్రదించి రూ. 2500 చెల్లించి దంపతులు పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.
Visakha Simhachalam : విశేష ఆధరణ కలిగిన ఈ పూజలో పాల్గొనడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మాసంలో ఒకే సారి జరిగే స్వాతి నక్షత్ర హోమంలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ప్రజలు స్వామి వారిని దర్శించుకున్నారు. భారీ ఎత్తున తరలి వచ్చిన భక్తులకు ఎటువంటి సమస్య తలెత్తకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.