A Man Attacked a Couple In Hyderabad : పెంపుడు జంతువుల పట్ల కొందరికి చాలా ప్రేమ ఉంటుంది. కుటుంబంలో ఒకరిగా వాటిని చూసుకుంటుంటారు. వాటి పట్ల ఎవరైనా గౌరవం లేకుండా ప్రవర్తిస్తే చాలా కోప్పడతారు కూడా. తాజాగా పెంపుడు కుక్క తమ ఇంటి వైపు వస్తుందంటూ పక్కింటి వారు దంపతులపై, కుక్కపై కర్కశంగా దాడి చేశారు.
Fight About Dog With Neighbour : హైదరాబాద్ మధురానగర్‌లో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పెంపుడు కుక్క తమ ఇంటి వైపు వస్తుందంటూ పక్కింటి వారు దంపతులపై, కుక్కపై కర్కశంగా దాడి చేశారు. శ్రీనాథ్-స్వప్న అనే దంపతులు రెహమత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరు ఓ శునకాన్ని పెంచుకుంటుండగా, అది తరచూ బయటికి వెళ్తుండటంతో పక్కింటి వారు అసహనం వ్యక్తం చేస్తుండేవారు. ఈ క్రమంలోనే ఈ నెల 14న శ్రీనాథ్ ఇంటికి పొరుగున ఉండే ధనుంజయ్ కుటుంబం పెంపుడు కుక్క విషయంలో గొడవపడ్డారు.
ఈ క్రమంలోనే 2 కుటుంబాల మధ్య మాటామాటా పెరగ్గా, ధనుంజయ్‌కు సంబంధించిన వ్యక్తులు శ్రీనాథ్‌పై కర్రలతో దాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన భార్య స్వప్నను కూడా కర్కశంగా చితక్కొట్టారు. ఈ దాడిలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. దంపతులపై అమానుషంగా దాడి చేసిన ధనుంజయ్‌కు చెందిన మనుషులు, ఆ తర్వాత ఇంట్లోకి పారిపోతున్న కుక్కపైనా దాడి చేశారు. కర్రతో తలపై కొట్టడంతో శునకం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
బాధిత కుటుంబం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మధురానగర్ పోలీసులు, సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించారు. దాడి చేసిన ధనుంజయ్, సాయి కుమార్, ప్రవీణ్ కుమార్, గౌరీ శంకర్, రాంబాబును అరెస్టు చేసిన పోలీసులు, వారిపై కేసులు నమోదు చేశారు. ధనుంజయ్ కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని శ్రీనాథ్ సోదరుడు కోరారు. నడిరోడ్డులో భార్యాభర్తలను చితకబాదటంతో పాటు పెంపుడు కుక్కను కనికరం లేకుండా కొట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
"మా సోదరుడు, తన భార్యపై ధనుంజయ్ అనే వ్యక్తి కర్రలతో దాడి చేశారు. కుక్క వల్ల దాడి జరిగింది. మహిళ అని కూడా చూడకుండా దాడి చేశారు. కనికరం లేకుండా కుక్కపై కూడా దాడి చేశారు. ధనుంజయ్ నుంచి మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. పోలీసులు మాకు రక్షణ కల్పించాలి." - బాధితుడి సోదరుడు
పెంపుడు కుక్కను హత్య చేసిన ఆకతాయిలు.. ఆ పనికి అడ్డువస్తున్నందుకే!
నాలుగేళ్ల చిన్నారిపై పెంపుడు కుక్క దాడి.. భుజం, చేతులపై కాట్లు.. బెదిరించినా వదలకుండా..