అక్రమంగా తరలిస్తున్న 1589 తాబేళ్లు పట్టివేత - ఇద్దరు అరెస్ట్‌ - Illegally Transporting Turtles

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 10:50 AM IST

thumbnail
అక్రమంగా తరలిస్తున్న 1589 తాబేళ్లు పట్టివేత - ఇద్దరు అరెస్ట్‌ (ETV Bharat)

Illegally Transporting Turtles Rescued: అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను పోలీసులు పట్టుకున్నారు. తాబేళ్లను ఒక మినీవ్యాన్​లో తరలిస్తున్న వారిని పట్టుకుని వాటిని రక్షించారు. కోనసీమ జిల్లా నుంచి ఒడిశాకు అక్రమమంగా పెద్ద మొత్తంలో సంచులలో తాబేళ్లను కట్టి తరలిస్తున్నారు. 

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం ఫోక్స్​పేట అటవీ చెక్ పోస్ట్ వద్ద ఒడిశాకు అక్రమంగా తరలి వెళ్తున్న 1589 తాబేళ్లను గురువారం తెల్లవారుజామున అటవీ రేంజ్ అధికారి కరుణాకర్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. అటవీ రేంజ్ అధికారి తెలిపిన వివరాలు ప్రకారం కోనసీమ జిల్లా రామచంద్రాపురం నుంచి ఒడిశాకు మినీ వ్యాన్​లో తాబేళ్లను తీసుకుని పోతుండగా సమాచారం మేరకు వీటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పెద్ద మొత్తంలో అక్రమంగా తాబేళ్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. వీటి విలువ సుమారు మూడు లక్షల రూపాయలు ఉంటుంది అని అటవీశాఖ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.