రిటర్నింగ్‌ అధికారి సహాయంతోనే వైఎస్సార్సీపీ నేతలు దాడి చేశారు: పులివర్తి నాని - Pulivarthi Nani Interview

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 10:06 AM IST

thumbnail
రిటర్నింగ్‌ అధికారి సహాయంతోనే వైఎస్సార్సీపీ నేతలు దాడి చేశారు: పులివర్తి నాని (ETV Bharat)

Chandragiri TDP MLA Candidate Pulivarthi Nani Interview :  తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయం ఆవరణలో వైఎస్సార్సీపీ నాయకులు మారణాయుధాలతో రెచ్చిపోయారు. ఇక్కడ ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించేందుకు మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో వచ్చిన తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారు.

YSRCP Leaders Attacks in Elections : పథకం ప్రకారమే తనను హత్య చేసేందుకు వైఎస్సార్సీపీ మూకలు యత్నించాయని పులివర్తి నాని తెలిపారు. ఈవీఎం స్ట్రాంగ్‍ రూముల పరిశీలనకు వెళుతున్న సమాచారం రిటర్నింగ్‍ అధికారికి మాత్రమే తెలియజేశానని, అదే సమయంలో అధికార పార్టీ గూండాలు ఆ ప్రాంతానికి ఎలా చేరుకున్నారని ప్రశ్నించారు. ముందస్తు ప్రణాళిక లేకుండా దాడి జరిగే అవకాశం లేదని తెలిపారు. రిటర్నింగ్‍ అధికారితో పాటు కొందరు పోలీసు అధికారులు చెవిరెడ్డి భాస్కర్‍ రెడ్డికి తొత్తులుగా వ్యవహరించడంతోనే తనపై దాడి జరిగిందని స్పష్టం చేశారు. రిటర్నింగ్‍ అధికారిపై తమకు నమ్మకం లేదని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామంటున్న పులివర్తి నానితో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.