'బోర్లు ఉన్న చోట్ల మాత్రమే ఆరుతడి పంటలు వేసుకోవడం మేలు' - Agriculture Officer Interview

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 11:55 AM IST

thumbnail
'బోర్లు ఉన్న చోట్ల మాత్రమే ఆరుతడి పంటలు వేసుకోవడం మేలు' (ETV Bharat)

Nellore Agriculture Officer Satyavani Interview On Farmers Problems : నెల్లూరు జిల్లాలో ఈ సారి లక్షల ఎకరాల్లో పంటలు పండించలేదు. జూన్‌లో ఖరీఫ్‌ రైతులకు అనుకూలంగాలేదు. కడప, కర్నూలు జిల్లాలో వర్షాలు కురిస్తేనే సోమశిల జలాశయం నిండుతుంది. కానీ ఈ ఏడాది తీవ్ర వర్షాభావం నెల్లూరు జిల్లా రైతులకు సమస్యగా మారింది. జిల్లా రైతులకు ఆరో ప్రాణం అయిన సోమశిల జలాశయంలో నీరు లేదు. నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరాయి. కాలువల్లో నీరు పారుదల లేకపోవడంతో ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కావలసిన ఎడగారు పంటల సాగును రైతులు కోల్పోయారు. 1.25లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదు.

జూన్ నుంచి మొదలు కావలసిన ఖరీఫ్ కూడా ప్రశ్నార్ధకంగా మారింది. ఖరీఫ్​లో సుమారు 2లక్షల ఎకరాల్లో వరి, వేరుశనగ సాగు చేస్తారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదని అధికారులు  అంటున్నారు. వర్షాలు కురిసే అవకాశాలు లేకపోవడంతో రైతులు బోర్లు ఉన్న చోట్ల మాత్రమే ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచిస్తున్న జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణితో ఈటీవీ భారత్​ ప్రతినిధి రాజారావు ముఖాముఖి.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.