వందే భారత్​ ఎక్స్​ప్రెస్​కు ప్రమాదం.. ముందు భాగం ధ్వంసం

By

Published : Oct 6, 2022, 5:46 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

thumbnail

భారతదేశ సెమీ హైస్పీడ్​ రైలు వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ ప్రమాదానికిి గురైంది. ముంబయి నుంచి గాంధీనగర్​ వెళ్తున్న రైలుకు.. బట్వా, మనినగర్​ మధ్యలో గెేదెలు ఎదురు వచ్చాయి. దీంతో ఉదయం 11 గంటల సమయంలో రైలు ప్రమాదానికి గురైంది. రైలు ముందు భాగం కొంత మేర ధ్వంసం అయింది. రైలు సిబ్బంది విరిగిన ఇంజిన్ ముందుభాగాన్ని తొలగించారు. అనంతరం ట్రాక్​ క్లియర్​ చేసి రైలును పునరుద్ధరించారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పశ్చమ రైల్వే పీఆర్​ఓ జేకే జయంత్​ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక హైస్పీడ్​ రైలును ప్రధాని మోదీ గత నెలలో ప్రారంభించారు.

Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.