ETV Bharat / sukhibhava

ముక్కు నుంచి రక్తం కారుతోందా? గులాబీ రేకులతో ఇలా చేయండి...

author img

By

Published : Nov 10, 2021, 5:42 PM IST

రక్తస్రావం, అల్సర్లు వంటి ఆరోగ్య సమస్యలకు కేవలం ఈ తీపి పదార్థం​తో చెక్​ పెట్టొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పలు రకాల స్వీట్లలో కూడా ఉపయోగించే ఈ పదార్థం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. మరి అదేంటో? దాని తయారీ ఎలాగో తెలుసుందాం.

gulkand health benefits
ముక్కు నుంచి రక్త కారుతుందా? తగ్గాలంటే ఇది తినండి

గుల్​కంద్​.. ఇది పలు రకాల స్వీట్ల తయారీలోకి వాడే మిశ్రమమే అయినా దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ కాస్త గుల్​కంద్​ను తింటే అల్సర్సు, రక్తస్రావం వంటి సమస్యలను దూరం చేయొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఈ గుల్​కంద్​ను ఎలా తయారు చేసుకోవాలంటే..

కావాల్సిన పదార్థాలు - ఎండురోజా పువ్వు రేకులు, తేనె, పంచదార, యాలకపొడి

తయారీ విధానం

ఓ బౌల్​ తీసుకుని అందులో ఈ పదార్థాలు అన్నిటినీ లేయర్స్​గా వేసుకోవాలి. ముందుగా చక్కెర​ వేసి ఆపైన గులాబీ రేకులు వేయాలి. మళ్లీ పంచదార, ఆ పైన గులాబీ రేకులు వేసుకుంటూ చివరగా పైన పంచదారను వేయాలి. గులాబీ రేకులు, షుగర్​ సమాన స్థాయిలో తీసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని రోజూ మూడు వారాలపాటు ఎండపెట్టాలి. అప్పటికి ఇది పాకంగా మారి జామ్​లా తయారవుతుంది. ప్రతిరోజు ఎండలో పెట్టి తీసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి.

ఈ మిశ్రమం తయారయ్యాక అందులో రుచి కోసం తేనె, కాస్త యాలకపొడి కలుపుకుంటే గుల్​కంద్​ రెడీ. ఈ గుల్​కంద్​ మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది. దీనిని రోజూ భోజనం తిన్న తర్వాత 3 నుంచి 5 గ్రాముల వరకు తీసుకోవచ్చు.

ప్రయోజనాలు..

గుల్కంద్​తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. గుల్కంద్​ తీసుకోవడం ద్వారా రక్తస్రావం, వేడి చేసి ముక్కలోంచి రక్తం కారడం వంటి సమస్యలకు చెక్​ పెట్టొచ్చు. అల్సర్స్​తో బాధపడేవారికి కూడా ఈ గుల్కంద్​ చక్కటి ఔషధం. యష్టిమధు పొడిని ఓ 2 గ్రాములు ఇందులో కలుపుకుని 15 రోజుల పాటు తీసుకుంటే అల్సర్స్​ తగ్గిపోతాయి.

అయితే.. మధుమేహంతో బాధపడుతున్న వారు మాత్రం ఈ గుల్​కంద్​ తీసుకోవడానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి : విటమిన్​ లోపం ఉందా? ఈ 'గ్రీన్​సూప్'​ తీసుకుంటే సరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.