ETV Bharat / sukhibhava

విటమిన్​ లోపం ఉందా? ఈ 'గ్రీన్​సూప్'​ తీసుకుంటే సరి

author img

By

Published : Nov 6, 2021, 2:16 PM IST

Updated : Nov 6, 2021, 2:36 PM IST

ప్రస్తుతం చాలా మందిలో విటమిన్​​ లోపం ప్రధాన సమస్యగా మారింది. అయితే.. అన్ని రకాల పోషకాలు ఉండే గ్రీన్​సూప్​తో విటమిన్ల​ సమస్యకు చెక్​ పెట్టొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

green soup
గ్రీన్​సూప్​

ఆహారం, విహారం ఆ తర్వాతే ఔషధానికి ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. సరైన ఆహారం లేక చాలా మందిలో విటమిన్​​ లోపం సమస్యగా మారిందని.. దీనిని అరికట్టాలంటే పోషకాలు ఉన్న పదార్థాలతో ఆహారం తీసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. గ్రీన్​ సూప్​ కూడా ఇదే కోవకు చెందినది.. దీని ద్వారా అన్ని రకాల విటమిన్లు, మినరల్స్​ అందుతాయి. మరి ఈ గ్రీన్​సూప్​ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కావాల్సిన పదార్థాలు

ఉడికించిన పెసరపప్పు-కందిపప్పు కట్టు, క్యారెట్​, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, సైందవ లవణం, పసుపు, పచ్చిమిరపకాయలు, పాలకూర, మెంతికూర, నూనె

తయారీ విధానం--

ముందుగా స్టవ్​ వెలిగించి పాన్​ పెట్టి అందులో 2 స్పూన్లు నూనె వేసి.. వేడయ్యాక వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, చిటికెడు పసుపు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా సైందవ లవణం, 1 కప్పు క్యారెట్​ ముక్కలు వేసి చిన్నమంటపై ఫ్రై చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్రమంలో 1 కప్పు మెంతి ఆకు, 1 కప్పు పచ్చి పాలకూర పేస్ట్​ వేసి వేయించుకోవాలి. ఇందులో కాస్త పసుపు వేయాలి. ఇందులో ఉడికించిన పెసరపప్పు-కందిపప్పు కట్టు వేసి కలపాలి. సరిపడా నీళ్లు పోసి కాసేపు ఉడికించుకుంటే గ్రీన్​ సూప్​ రెడీ.

ఇదీ చూడండి : మునగాకు దోశలతో కీళ్ల నొప్పులకు చెక్​!

Last Updated : Nov 6, 2021, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.