ETV Bharat / state

నవంబరు 1 నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల నిషేధం... వ్యాపారుల్లో ఆందోళన

author img

By

Published : Oct 27, 2022, 2:14 PM IST

plastic Flexis
ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల నిషేధంపై వ్యాపారుల ఆందోళన

Plastic Flexis ban: నవంబరు ఒకటో తేదీ నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలను నిషేధించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో దీనిపై ఆధారపడి జీవిస్తున్న వ్యాపారుల్లో ఆందోళన పెరుగుతోంది. దీన్నే నమ్ముకొని జీవిస్తున్న తమ బతుకులు ఏమవ్వాలని వారంతా వాపోతున్నారు. లక్షలాది రూపాయలు బ్యాంకు రుణాలు తీసుకొని యూనిట్లు ఏర్పాటు చేసుకున్నామని ఇప్పుడు ఫ్లెక్సీలను నిషేధించడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల నిషేధంపై వ్యాపారుల ఆందోళన

Plastic Flexis ban: రాష్ట్రంలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల వాడకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలుకు గడువు సమీపిస్తోంది. నవంబరు 1వ తేదీ నుంచి నిషేధం అమల్లోకి వస్తుండటంతో ఫ్లెక్సీ వ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రకాశం జిల్లాలో దాదాపు... వంద ఫ్లెక్సీ ప్రింటింగ్ యూనిట్లు ఉన్నాయి. వేలాది కుటుంబాలు ఈ వ్యాపారం మీదే జీవిస్తున్నాయి. గ్రాఫిక్స్‌ డిజైనర్లు, ప్రింటింగ్‌ కార్మికులు, ఫ్లెక్సీల ఫ్రేమ్స్‌ తయారీదారులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే కూలీలు ఈ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. ఇప్పుడు హఠాత్తుగా నిషేధం విధించడం వల్ల ఏం చేయాలో తమకు అర్థం కావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ప్రత్యామ్నాయ మార్గం చూపించిన తరువాతే నిషేధం అమలు చేయాలని కోరుతున్నారు.

ప్లాస్టిక్ ఫ్లెక్సీ ముద్రణా యంత్రాలను లక్షల రూపాయలు రుణాలు తీసుకుని కొన్నామని, బ్యాంకు అప్పులు తీర్చుకోలేని దుస్థితిలో ఉన్నామని వ్యాపారులు వాపోతున్నారు. కరోనా రెండేళ్లూ వ్యాపారాలు లేక ఆర్ధికంగా ఇబ్బంది పడ్డామని, ప్రభుత్వ నిర్ణయంతో అప్పులనుంచి బయటపడే మార్గమే కనిపించడంలేదని అంటున్నారు. ప్రత్యామ్నాయంగా క్లాత్‌ ఫ్లెక్సీలు తయారు చేసే యంత్రాలు తేవాలంటే...ఇప్పటికిప్పుడు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి కనీసం ఏడాదైనా గడువు ఇస్తే ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకుంటామని వ్యాపారులు వేడుకుంటున్నారు. లేకుంటే లక్షల కుటుంబాలు వీధినపడుతాయని చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.