ETV Bharat / opinion

రికార్డు స్థాయిలో నమోదైన పోలింగ్ - ఎన్డీయేకు 130-140 అసెంబ్లీ సీట్లు? - OPINION ON ANDHRA ELECTIONS

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 15, 2024, 11:38 AM IST

Prathidwani: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్‌ బ్యాలట్‌తో కలిపి 81.76% పోలింగ్‌ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఓటింగ్‌ జరగడం ఇదే తొలిసారి. పోటెత్తిన ఓటుకి సంకేతం ఏంటి? అనే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో సీఈఓ రైజ్ సర్వే ప్రవీణ్‌, రాజకీయ విశ్లేషకులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ETV Bharat Prathidwani
ETV Bharat Prathidwani (ETV Bharat)

Prathidwani : ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని ఓటర్లు కాచుక్కూచున్నారు. 1800కు పైగా చీకటిరోజులను గడిపిన తర్వాత ఆ శుభముహుర్తంరానే వచ్చింది. దేశదేశాల నుంచి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివచ్చిన ఓటర్లు కసిగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. 2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 75 శాతం, 2019 ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ నమోదు కాగా ఈసారి 80 దాటేసింది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటింగ్‌కు తరలి రావటం దేనికి సంకేతం ? ఏపీ ప్రజల మనోగతం ఏమై ఉండవచ్చు? పోటెత్తిన ఓటుకి సంకేతం ఏంటి? అనే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో సీఈఓ రైజ్ సర్వే ప్రవీణ్‌, రాజకీయ విశ్లేషకులు శ్రీనివాసరావు పాల్గోన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రాష్ట్రంలో 81.76 శాతం పోలింగ్​ నమోదు - గతంలో కంటే పెరిగిన ఓటింగ్​ - Poll Percentage in ap

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్‌ బ్యాలట్‌తో కలిపి 81.76% మేర పోలింగ్‌ నమోదైంది. ఈవీఎంల ద్వారా 80.66 శాతం పోలింగ్, పోస్టల్‌ బ్యాలెట్‌ 1.10 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఓటింగ్‌ జరగడం ఇదే తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికల్లో 72.63%, 2014లో 78.90%, 2019లో 79.80% మేర పోస్టల్‌ బ్యాలట్‌ కలిపి పోలింగ్‌ నమోదైంది. ఆ లెక్కన చూస్తే ప్రాథమిక అంచనాల ప్రకారం ఈసారి 2009తో పోలిస్తే 9.74%, 2014తో పోలిస్తే 3.47%, 2019తో పోలిస్తే 2.57% మేర అధికంగా ఓటింగ్‌ జరిగింది.

సోమవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకూ 47కు పైగా కేంద్రాల్లో పోలింగ్‌ కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా పోలింగ్‌ ముగిసిన తర్వాత మొత్తంగా 80.66% మేర ఓటింగ్‌ నమోదైంది. పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ 1.10 శాతాన్ని దీనికి కలిపితే మొత్తం పోలింగ్‌ 80.66% నమోదైంది. రాష్ట్రంలో ఈసారి మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు ఉండగా అందులో 4,44,218 మంది పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్నారు.

2019లో పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా 2,95,003 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అప్పటి కంటే 2024లో అదనంగా 1,49,215 మంది ఓటర్లు పోస్టల్‌ బ్యాలట్‌ వాడారు.

ఎన్టీఏ 130-140 అసెంబ్లీ సీట్లు? : యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనడం ఇతర రాష్ట్రాల నుంచి ఆరు లక్షలకుపైగా ఓటర్లు తరలి రావడం వంటి పరిణామాలతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఓటింగ్‌ శాతం వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు దర్పణంగా టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎన్టీఏ అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది. కనీసం 130-140 అసెంబ్లీ సీట్లు, 23 వరకు లోక్‌సభ స్థానాలు గెలుస్తామని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ సరళి ఎన్టీఏ పక్షాలకు అనుకూలంగా ఉందని వస్తున్న వార్తలతో టీడీపీ శిబిరంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.

యువత భవిష్యతుకు పునాది వేసిన పండుటాకులు - ఓటేసి ఆదర్శంగా నిలిచిన వృద్ధులు - Old age Voters Cast Their vote

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.